జాతీయ వార్తలు

సరిసద్దులో ఉగ్రవాదుల కదలికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, మే 14: జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు సమాచారం రావడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నెల 19న ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దీనిపై ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నిరంతరంగా కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నామని, వచ్చే మూడు నాలుగు రోజులు ఇది కొనసాగుతుందని చెప్పారు. సరిహద్దు కంచె వద్ద ఐదుగురు ఉగ్రవాదుల కదలికలను బిఎస్‌ఫ్ జవానులు గుర్తించారని, దీంతో అప్రమత్తమైన భద్రతాదళాలు తమ తనిఖీలను ముమ్మరం చేశారని కథువా ఎస్పీ శ్రీ్ధర్ పటేల్ తెలిపారు. రహదారిపై అదనంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, అలాగే హెలికాప్టర్‌ల ద్వారా ఏరియల్ సర్వే కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. కథువా, సాంబ, జమ్మూ జిల్లాలోని భద్రతా దళాలను అప్రమత్తం చేశామన్నారు.