జాతీయ వార్తలు

అత్యంత ఖరీదైన ఎన్నికలు ఇవే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ‘ఖరీదై’న ఎన్నికలుగా చెప్పవచ్చు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు డబ్బును మంచినీళ్లప్రాయంగా ఖర్చుపెట్టేశాయ. ఇప్పటివరకూ దేశంలో జరిగిన ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంత భారీఎత్తున ధన ప్రవాహం లేదని విశే్లషకులు వెల్లడిస్తున్నారు. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) అనే సంస్థ దిగ్భ్రాంతికరమైన అంశాలు తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ సంస్థ వెలువరించే నివేదికలకు ఎంతో విశ్వసనీయత ఉంటుంది. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అన్నీ విచ్చలవిడిగా డబ్బును వెదజల్లారని సీఎంఎస్ పేర్కొంది. 2013 నాటి అసెంబ్లీ ఎన్నికలతో పోలుస్తూ వెబ్‌సైట్‌లో ఉంచారు. రాష్ట్రంలో ఏకంగా 9,500-10,500 కోట్ల వరకూ ఖర్చుపెట్టారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇది రెట్టింపు. ఇందులో ప్రధాన మంత్రి ఎన్నికల ప్రచారానికి అయిన ఖర్చును చేర్చలేదు. అదికూడా కలిపితే చెప్పనక్కర్లేదు. సీఎంఎస్ గత ఇరవై ఏళ్లుగా ఎన్నికల తీరుతెన్నులపై విశే్లషణలు ఇస్తూ వస్తోంది. ఇంతకుముందు జరిగిన ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోలూ ఇంత భారీగా డబ్బు ఖర్చుపెట్టలేదని సంస్థ చెప్పింది. ఈ లెక్కన చూస్తే 2019 లోక్‌సభ ఎన్నికల వ్యయం ఏ స్థాయిలో ఉంటోందని సీఎంఎస్ స్పష్టం చేసింది. 50,000-60,000 కోట్ల రూపాయల దాటేసినా ఆశ్చర్యం లేదని తెలిపింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు పెట్టిన ఖర్చు 30వేల కోట్లని సీఎంఎస్‌కు చెందిన ఎన్ భాస్కర్‌రావు వెల్లడించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మే 2న కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఒకే విడతలో ఈ నెల 12న పోలింగ్ జరిగింది. మంగళవారం ఓట్ల లెక్కింపు. ఇక్కడ ఒక్కో అభ్యర్థి ఎన్నికల్లో చేసిన వ్యయం 75 శాతం పెరిగిపోయిందని సర్వేలు చెబుతున్నాయి. ‘లోక్‌సభ ఎన్నికలయితే అభ్యర్థి వాటా 55-60 శాతం ఉండొచ్చు. పార్టీల వాటా 29-30 శాతం పెరగవచ్చు’ అని తెలిపారు. మీడియా క్షేత్రస్థాయి నివేదికలు, జర్నలిస్టులు, వివిధ సంస్థలు అందించిన సమాచారాన్ని క్రోడీకరించి సీఎంఎస్ ఈ నివేదికను రూపొందించింది. దీనిబట్టి చూస్తే ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శంగా జరుగుతాయని చెప్పడం ఓ జోక్ అవుతుంది. నగదు, మద్యం ప్రవాహాన్ని కట్టడి చేయడానికి ఈసీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం శూన్యమే..