జాతీయ వార్తలు

ఉత్కంఠకు నేటితో తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 14: కర్నాటకలో నరాలు తెగే ఉత్కంఠకు నేటి తెరపడనుంది. 222 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది. కర్నాటకలో గెలుపునకు అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు పోరు సాగింది. ఎగ్జిట్‌పోల్స్ అన్నీ హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పాయి. ప్రభుత్వం ఏర్పాటులో మాజీ ప్రధాని దేవేగౌడ నాయకత్వంలోని జేడీ(ఎస్) కింగ్‌మేకర్ పాత్ర పోషిస్తుందని కథనాలు వెలువడ్డాయి. ఎగ్జిట్‌పోల్స్ ఎలా ఉన్నప్పటికీ మరి కొద్ది గంటల్లోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 224 స్థానాలున్న అసెంబ్లీలో 222 నియోజవర్గాలకు ఈ నెల 12న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గొడవలు జరిగిన నేపథ్యంలో ఆర్‌ఆర్ నగర్ అసెంబ్లీ ఎన్నిక నిలిపివేశారు. అలాగే జయనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మృతి చెందడంతో పోలింగ్ జరగలేదు.
ఓట్ల లెక్కింపునకు 40 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభవుతుందని ఎన్నికల సంఘం వెల్లడించింది. లెక్కింపు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ఏ పార్టీకి అవకాశాలున్నాయో ట్రెండ్ తెలిసిపోతుంది. సాయంత్రం నాటికి లెక్కింపుపూర్తయి, అభ్యర్థుల ప్రకటన వెలువడుతుంది. గెలుపు విషయానికొస్తే కాంగ్రెస్, బీజేపీ ధీమాగానే ఉన్నాయి. రెండు పార్టీల నుంచి అతిరథమహారథులు ఎన్నికల ప్రచారం చేశారు. వందేళ్లనాటి పార్టీ కాంగ్రెస్ గెలిస్తే సిద్ధరామయ్య మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని భావించారు. అయితే అనూహ్యంగా దళితనేత ముఖ్యమంత్రి అయినా తనకు అభ్యంతరం లేదని పోలింగ్ ముగిసిన తరువాత సిద్దరామయ్య అనూహ్య ప్రకటన చేయడం గమనార్హం. పార్టీ అధిష్ఠానం మాటే తనకు శిరోధార్యమని ఆయన స్పష్టం చేశారు. సిద్ధరామయ్య జేడీ(ఎస్) మాజీనే. దేవేగౌడ పార్టీతో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్‌లోకి వచ్చారు. పోలింగ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య ‘కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుంది. నేను ముఖ్యమంత్రిని అవుతాను’ అని ప్రకటించారు. ఇప్పుడాయనే దళిత నేత సీఎం అయినా తనకు అభ్యంతరం లేదని చెప్పడం గమనార్హం. ‘నేను ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఎవరు సీఎం అయినా నాకు ఒకే. తుది నిర్ణయం హైకమాండ్‌కే వదిలేస్తున్నాను’ అని ఆయన తాజాగా వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల నిర్ణయం మేరకే నాయకుడి ఎంపిక ఉంటుందని కూడా ఆయన తెలిపారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును కాంగ్రెస్ ప్రకటించలేదు. తాజాగా సిద్ధరామయ్య ప్రకటన నేపథ్యంలో దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, లోక్‌సభలో పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ జీ పరమేశ్వర పేర్లను హైకమాండ్ పరిగణనలోకి తీసుకునే అకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. కాగా ఖర్గే ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగిస్తే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మరోపక్క వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు కర్నాటకలో విజయం సాధిస్తే కచ్చితంగా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేదే. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వచ్చింది. కాబట్టే ఇక్కడ గెలుపును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్టమ్రంతటా విస్తృతంగా ప్రచారం చేశారు. యుపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ చివర్లో ఎన్నికల ప్రచారం చేశారు. డిమోనిటైజేషన్, నీరవ్, విజయ్ మాల్యాల ఉదంతాలతో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ ప్రభుత్వం కర్నాటకను గెలుచుకుంటే అదనపుబలమేనని పరిశీలకులు చెబుతున్నారు. కర్నాటకలో గెలిస్తే దేశంలో తమకు తిరుగుడందని ఆ పార్టీ భావిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్ అన్నీ జేడీ(ఎస్) కింగ్‌మేకర్ అంటూ చెబుతుండగా ఆ పార్టీ మాత్రం మెజారిటీ సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉంది. కింగ్‌మేకర్ కాదు.. కింగే, హెచ్‌డీ కుమారస్వామి సీఎం అవుతారని జేడీ(ఎస్) ఆశీస్తోంది. జేడీ(ఎస్)ను గతంలో బీజేపీ, కాంగ్రెస్‌తోనూ కలిసి పనిచేసింది.

చిత్రం..చిక్‌మగళూర్‌లో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద గస్తీ కాస్తున్న జవాన్