జాతీయ వార్తలు

ఎటూ తేల్చని ఓటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 15: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల ఆశలు తలకిందులయ్యాయి. అధికారాన్ని ఆశించిన బీజేపీ స్వల్ప మెజార్టీకి తొమ్మిది సీట్ల దిగువనే ఆగిపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ రెండు పార్టీలకూ జేడీఎస్ మద్దతు అనివార్యంగా మారింది. ముందుగానే జేడీఎస్‌తో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకట్ట వేసింది. అయితే జేడీఎస్‌లో ఓ వర్గాన్ని తనవైపు తిప్పుకోవడం ద్వారా అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ వాజూభాయ్ పటేల్ నిర్ణయం కీలకంగా మారింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని గవర్నర్‌ను బీజేపీ కోరింది. జేడీఎస్‌తో కలిపితే తమకే ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి తమకే ముందుగా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఈ రెండు పార్టీలూ ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. 224 అసెంబ్లీ సీట్లకు, 222 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీకి 104 సీట్లతో అసెంబ్లీలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. ఈ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ చేరుకునేందుకు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్‌కు 78, జెడిఎస్ కూటమికి 38 సీట్లు వచ్చాయి. ఇతరులకు రెండు సీట్లు వచ్చాయి. ఎన్నికల ఫలితాలు లెక్కింపు జరుగుతుండగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హడావుడిగా విలేఖర్ల సమావేశాన్ని నిర్వహించి జెడిఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మద్దతు ఇస్తామని ప్రకటించడం విశేషం. దీంతో అందరి కళ్లు రాజ్‌భవన్ తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. గవర్నర్
వాజూభాయ్ వాలా ఎవరిని పిలవాలనే విషయమై రాజ్యాంగ నిపుణుల సలహాను కోరనున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఏకైక పెద్ద పార్టీ బీజేపీ పిలవాలా, లేక కాంగ్రెస్ మద్దతు ఉన్న జేడీఎస్‌ను ఆహ్వానించాలా అనే విషయమై గవర్నర్ ముందున్న సవాలు. ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీ, జేడీఎస్-కాంగ్రెస్ కూటమి నేతలు హడావుడిగా రాజ్‌భవన్‌కు వెళ్లి తమకు మద్దతు ఉందంటే తమకు ఉందని గవర్నర్‌కు చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ విలేఖర్లతో మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం. మేము మద్దతు ఇచ్చేందుకు తలుపులు తెరిచి ఉన్నాం ’ అన్నారు. ముందు బిజెపికి అధికారం ఏర్పాటు చేసేందుకు తగినన్ని సీట్లు వస్తాయనుకున్నాం, కాని బిజెపి మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో నిలిచిపోయింది. మాకు బాగానే సీట్లు వచ్చాయి. కాని జెడిఎస్‌కు ఆశించిన సీట్లు రాలేదని ఆయన అన్నారు.
కర్నాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎన్నికల ఫలితాలు సూచించడంతో ఢిల్లీ నుంచి మధ్యాహ్నం ఎఐసిసి, బిజెపి అగ్రనేతలు బెంగళూరుకు హడావుడిగా చేరుకున్నారు. బెంగళూరులో క్షణక్షణం మారుతున్న రాజకీయ పరిణామాలతో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. మణిపూర్, గోవాలో కాంగ్రెస్ పార్టీ సత్వరమే స్పందించి ప్రభుత్వం ఏర్పాటుకు కలిసి వచ్చే పార్టీలకు మద్దతు ఇవ్వడంలో విఫలమైంది. ఈ విమర్శలకు జవాబు చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ జెడిఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు మంగళవారం మధ్యాహ్నమే ప్రకటించింది. ఎఐసిసి తీర్మానం మేరకు, పార్టీ అధినేత్రి ఆదేశం మేరకు జెడిఎస్‌కు మద్దతు ఇస్తామని కర్నాటక ముఖ్యమంత్రిగా దిగిపోనున్న సిద్ధరామయ్య విలేఖర్లకు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాలని ఆయన అన్నారు.
బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి యెడ్యూరప్ప విలేఖర్లతో మాట్లాడుతూ, తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కర్నాటక ఓటర్లు తిరస్కరించారన్నారు. దొడ్డిదారి ద్వారా అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేసే కుయుక్తులను ప్రజలు క్షమించరన్నారు.
కాగా కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతు ఇవ్వడాన్ని జెడిఎస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి హెచ్‌డి కుమారస్వామి స్వాగతించారు. ఈ మద్దతును స్వీకరిస్తున్నామని చెప్పారు. గవర్నర్ అపాయింట్‌మెంట్‌ను కోరుతున్నట్లు కూడా ఆయన విలేఖర్లకు చెప్పారు. ఎన్నికలకు ముందు జెడిఎస్-కాంగ్రెస్ పార్టీకి మధ్య పొత్తు లేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ తీసుకునే నిర్ణయం కోసం రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 37.9 శాతం, బిజెపికి 36.2 ఓట్లు, జెడిఎస్‌కు 18.4 శాతం ఓట్లు వచ్చారు.

చిత్రం..ప్రభుత్వ ఏర్పాటుకు తమనే ఆహ్వానించాలంటూ గవర్నర్‌ను కలిసిన యెడ్యూరప్ప