జాతీయ వార్తలు

వారణాసిలో కూలిన ఫ్లైఓవర్ వంతెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 15: వారణాసిలో నిర్మాణంలో ఉన్న ఒక ఫ్లైవోవర్ వంతెన భాగం కూలిన ఘటనలో 26 మంది మరణించినట్లు, మరో కొందరు శిథిలాల్లో చిక్కుకుని ఉన్నట్లు భావిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వారణాసి కంటోనె్మంట్‌కు సమీపంలోని ఫ్లైవోవర్‌లో కొంత భాగం మంగళవారం కూలింది. వంతెన కూలడంతో శిథిలాల్లో చాలా మంది కార్మికులు చిక్కుకున్నారు. శిథిలాల కింద నాలుగు వాహనాలు, ఒక మినీ బస్సు కూడా చిక్కుకున్నాయి. ఫ్లైవోవర్‌లో కొంత భాగం కూలుతుండగా చూశానని, ఆ ప్రాంతం ఆర్తనాదాలతో దద్దరిల్లిందని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మూడు జెసిబిలను రంగంలోకి దించారు. పెద్ద వాహనాలు వచ్చేందుకు వీలుగా ఫ్లైవోవర్ వద్ద ఉన్న ఒక గోడనును కూడా అధికారులు కూల్చారు. శిథిలాలను వెలికి తీస్తున్నామని, క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన పట్ల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఉపముఖ్యమంత్రి కేశవ్ వౌర్య, మంత్రి నీలకంఠ్ తివారీని సంఘటన ప్రదేశానికి వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం..ఫ్లైఓవర్ కూలడంతో నుజ్జునుజ్జయన కార్లు.. సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది