జాతీయ వార్తలు

‘చంద్రుల’ అంచనాలు తారుమారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించటం ద్వారా బీజేపీ దక్షిణాది జైత్రయాత్ర ప్రారంభమైందని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మేలుకొలుపు కావాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభావం తగ్గిందంటూ కొందరు ముఖ్యమంత్రులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు నిజం కాదని కర్నాటక ఫలితాలు సూచిస్తున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలోచనలో పడవేశాయి. కర్నాటకలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ 2019లో జరిగే లోక్‌సభ, రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ సీట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభావం తగ్గుతోందని భావించిన ఇద్దరు చంద్రుల అంచనాలను కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తలకిందులు చేశాయి. కర్నాటక ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై ఏమాత్రం పడినా 2019లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీట్లు బాగా పెరుగుతాయి. హైదరాబాద్ కర్నాటకలో బీజేపీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కర్నాటకలో ఏకైక పెద్దపార్టీగా అవతరించినట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించకపోవచ్చు కానీ సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోవచ్చు. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీని అమలు చేయటం మూలంగా నరేంద్ర మోదీ ప్రజల మద్దతు కోల్పోయారని చెప్పటం నిజం కాకపోవచ్చు.
చంద్రబాబుపై బీజేపీ దృష్టి
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తలదూర్చి బీజేపీని ఓడించాలని పిలుపు ఇచ్చిన చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఇరుక్కుపోయారు. తమ దక్షిణాపథ జైత్రయాత్ర ప్రారంభమైంది.. చంద్రబాబు మార్కు రాజకీయాలను కర్నాటకలోని తెలుగు ప్రజలు తిరస్కరించారు అని రామ్‌మాధవ్ ప్రకటించారు. కర్నాటక ఫలితాలు వస్తున్న సమయంలోనే రామ్‌మాధవ్ ట్వీట్ చేస్తూ చంద్రబాబు రాజకీయాలను హైదరాబాద్ కర్నాటక ప్రజలు తిరస్కరించారని చెప్పడం గమనార్హం. కర్నాటకలోని తెలుగు ప్రజలు బీజేపీకి ఓటు వేయకుండా చూసేందుకు చంద్రబాబు అన్ని ఎత్తులూ వేశారు.. అయితే తెలుగు ప్రజలు చంద్రబాబు రాజకీయాన్ని పూర్తిగా తిరస్కరించారని ఆయన చెప్పారు. తెలుగు ప్రజలు అధికంగా నివసించే హైదరాబాద్ కర్నాటక ప్రాంతంలో బీజేపీ సీట్లు ఆరు నుండి ఇరవైకి పెరిగాయని రామ్‌మాధవ్ తెలిపారు.
కర్నాటకలో బీజేపీని ఓడించాలని పిలుపు ఇవ్వటంతోపాటు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబును కర్నాటకకు పంపించిన చంద్రబాబుపై ఇప్పుడు బీజేపీ దృష్టి సారిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును మట్టి కరిపించేందుకు చేయవలసినదంతా చేయాలని బీజేపీ అధినాయకత్వం యోచిస్తోంది.
బాబుకు చుక్కెదురు: జీవీఎల్
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో చంద్రబాబుకు చుక్కెదురైందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చెప్పారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కర్నాటకలో బీజేపీకి అనూహ్యమైన ఫలితాలు వస్తాయని తాను ప్రకటిస్తే.. అవి ప్రగల్భాలని చంద్రబాబు కొట్టివేశారు.. ఇప్పుడైమేంది? అని నరసింహారావు బాబును నిలదీశారు. రానున్న ఐదారు నెలల్లో బీజేపీ ఏపీలో అనూహ్యంగా పుంజుకుంటుందని ఆయన ప్రకటించారు. కర్నాటకలోని తెలుగు ప్రజలు తెలుగుదేశం ప్రచారాన్ని తిప్పికొట్టి బీజేపీకి నీరాజనాలు పలికారని ఆయన అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. కేవలం ప్రచారం.. అబద్ధాలే ప్రభుత్వం అని భావించటం మానుకోవాలి.. లేకుంటే కర్నాటకలో సిద్ధరామయ్యకు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందని నరసింహారావు హెచ్చరించారు. కర్నాటక ప్రజలు ఆదరించినట్లు తెలుగు ప్రజలు కూడా బీజేపీని ఆదరిస్తారు, అభివృద్ది కోసం బి.జె.పికి పట్టం కడతారని చెప్పారు. ఏపీ ప్రజలు మంచి పాలన, అభివృద్ధిని కోరుకుంటున్నారు.. స్వప్రయోజనాల కోసం పనిచేసే వారిని.. కోట్లకు పడగలెత్తిన వారిని ప్రజలు తిప్పికొడతారని ప్రకటించారు. ఏపీలో విజయం సాధించే కార్యాచరణతో బీజేపీ త్వరలోనే రాష్ట్ర ప్రజల ముందుకు వస్తుందని నరసింహారావు చెప్పారు.