జాతీయ వార్తలు

బీజేపీకే ‘కర్నాటక’ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: కర్నాటకలో బీజేపీ ఎక్కువ సీట్లు తెచ్చుకుని అతి పెద్ద పార్టీగా అవతరించిందని, నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలకు ప్రజలు ఆమోద ముద్రవేశారని బీజేపీ అభివర్ణించింది. ఈ ఎన్నికల్లో కర్నాటక ప్రజలు విభజన శక్తులు, కుహనా లౌకికవాదులను తిరస్కరించారన్నారు. మంగళవారం కేంద్ర మంత్రి రవశంకర్ ప్రసాద్ విలేఖర్లతో మాట్లాడుతూ, కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెను అధికారంలోకి తేలేకపోయిన రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కలలుకంటున్నారన్నారు. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ, మోదీ అభివృద్ధి అజెండాకు ప్రజలు సమ్మతిని తెలియచేశారన్నారు. కర్నాటక చరిత్రలో బీజేపీ గెలుపు చారిత్రక దినంగా మిగిలిపోతుందన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, బీజేపీ గెలుపు ప్రజాస్వామ్య శక్తుల గెలుపుగా పేర్కొన్నారు. దక్షిణది రాష్ట్రం కర్నాటకలో బీజేపీ రెండోసారి పాగా వేసిందన్నారు. భారత్‌ను కాంగ్రెస్ చెర నుంచి విముక్తి కల్పించాలన్న తమ అజెండా సాకారమైందని, కర్నాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. 2019 ఎన్నికల్లో కూడా బీజేపీ కేంద్రంలో పెద్ద మెజార్టీతో అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ పతనావస్థలో ఉందని, మహాత్మాగాంధీ కాంగ్రెస్‌ను మూసివేయాలని స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో కోరారని, ఆ పనిని రాహుల్ గాంధీ ఇప్పుడు చేస్తున్నారన్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్ గెలిస్తే ఇవిఎంలు బాగాపనిచేసినట్లు, ఓడిపోతే ఈవీఎంలపై నెపం నెట్టడం కాంగ్రెస్‌కు అలవాటన్నారు. కేంద్ర మంత్రి జావడేకర్ మాట్లాడుతూ తమ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. మోదీ, అమిత్‌షాల వల్ల బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు.