జాతీయ వార్తలు

షికారిపుర నుంచి ఏడోసారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 15: బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్పకు సొంత నియోజకవర్గం షికారిపురపై ఏమాత్రం పట్టుసడల లేదన్న విషయం మంగళవారం నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయి. నియోజకవర్గం నుంచి వరుసగా ఏడోసారి యెడ్యూరప్ప ఘన విజయం సాధించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టుసాగిన పోరులో భారతీయ జనతాపార్టీ పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. లింగాయత్‌లు ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాలతేష్ పోటీ చేశారు. యెడ్యూరప్పతో పోల్చుకుంటే మాలతేష్ అత్యంత బలహీనమైన అభ్యర్థే. అలాగే లింగాయత్‌ల ఎక్కువగా ఉండే శివమొగ్గ పార్లమెంటు నియోజకవర్గానికి యెడ్డీనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది కూడా బీఎస్ గెలుపునకు సహకరించింది. శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిదే షికారిపుర. పోలింగ్‌కు 48 గంటల ముందే బీజేపీకి తిరుగులేని మెజారిటీ వస్తుందని యెడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని, సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పుకొచ్చారు.