జాతీయ వార్తలు

గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 15: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాని పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా ఆహ్వానించాలని బీజేపీ డిమాండ్ చేయడం, అదే విధంగా కాంగ్రెస్-జేడీఎస్ కూటమి తమదే మెజారిటీ అన్న వాదనతో ముందుకు రావడంతో గవర్నర్ నిర్ణయమే కీలకంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ వారాల తరబడి ఎగతెగని ప్రచారం జరిపినా కర్ణాటక ఓటర్లు మాత్రం ఏ పార్టీకీ మెజారిటీ కట్టబెట్టకపోవడంతో గవర్నర్ ఎవర్ని పిలుస్తారన్నది చర్చనియాంశంగా మారింది. ఇప్పుడు గవర్నర్ వాజుభాయ్ పటేల్‌పైనే కేంద్రీకృతమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని పిలుస్తారా? లేక సంఖ్యాపరంగా మెజారిటీ ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని ఆహ్వానిస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది. గత రాజకీయ పరిణామాలు బట్టి చూస్తే గవర్నర్ తీసుకునే నిర్ణయం ఏదో వర్గాన్ని నొప్పించేదిగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు ఉదాహణగా గోవా, మణిపూర్ కేసులను చెబుతున్నారు. రాజకీయాలు వాటి పలుపులు, విరుపులకు అలవాటుపడ్డ వాజూభాయ్ పటేల్ ఇటు బీజేపీకి అటు ప్రధాని నరేంద్ర మోదీకీ అత్యంత సన్నిహితుడన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇది ఆయన తీసుకోబోయే నిర్ణయాన్ని మరింత సంక్లిష్టంగా కష్టతరంగా మార్చిందన్న వాదన కూడా తెరమీదకు వచ్చింది. అతిపెద్ద పార్టీకి ఆహ్వానమా లేక ఎక్కువ సీట్లున్న కూటమిని పిలవడమా అన్నది ఆయన ముందున్న ప్రధాన ప్రశ్న.