జాతీయ వార్తలు

చిచ్చు పెట్టేవారికి ఇదో గుణపాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: ఉత్తరాది, దక్షిణాది మధ్య గొడవ పెట్టటం ద్వారా ప్రజలను విడదీసేందుకు ప్రయత్నించటం ఎంతమాత్రం మంచిది కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. మంగళవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో కర్నాటక విజయంపై ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ బీజేపీ ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య చిచ్చు పెడుతోందని ప్రచారం చేసేవారికి కర్నాటక ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు మరికొందరు నాయకులు ఉత్తరాదికి చెందిన బీజేపీ దక్షిణాదికి చెందిన రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని ఆరోపించటం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాల నుండి వస్తున్న ఆదాయాన్ని కేంద్రం ఉత్తరాది రాష్ట్రాల్లో ఖర్చు పెట్టటం ద్వారా తమకు అన్యాయం చేస్తోందని కూడా ఆయన విమర్శించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మత రాజకీయం, కుల రాజకీయం చేయటం దేశానికి హానికరమని ఆయన హెచ్చరించారు. కర్నాటకలో బీజేపీ అద్భుత విజయం సాధించిందన్నారు. బీజేపీని ఉత్తరాది పార్టీగా ముద్రవేయటం అన్యాయం. అస్సాం, మహారాష్ట్ర, త్రిపుర, కర్నాటక ఉత్తరాదిన ఉన్నాయా అని మోదీ ప్రశ్నించారు. బీజేపీ ప్రజలకోసం, దేశంకోసం అహర్నిశలు కృషిచేసే పార్టీ.. బీజేపీ ఎన్నికల రాజకీయం చేయదు.. రాజ్యాంగం ప్రకారం దేశ ప్రజల అభ్యున్నతికోసం పని చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి కానీ దేశం పునాదులను దెబ్బతీసేందుకు ప్రయత్నించటం చాలా తీవ్రమైన అంశమని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన ఆరోపించారు. పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ నుండి ఓటింగ్ వరకు ప్రజాస్వామ్య వ్యవస్థను పని చేయనివ్వలేదని మోదీ ఆరోపించారు. బ్యాలెట్ పెట్టెలు చెరువుల్లో లభించటం ఏమిటి? బీజేపీతోసహా ఇతర పార్టీల కార్యకర్తలను హత్య చేశారు.. ఇది చాలా తీవ్రమైన విషయమని ప్రధాన మంత్రి అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ముందు నడిచిన పశ్చిమ బెంగాల్‌లో హత్యా రాజకీయాలేంటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండటంతోపాటు ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తోంది.. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటోందని నరేంద్ర మోదీ చెప్పారు.
కాంగ్రెస్‌ను తిరస్కరించిన కర్నాటక: అమిత్ షా
కాంగ్రెస్ పార్టీ అనువంశిక రాజకీయాలను కర్నాటక ప్రజలు తిరస్కరించారని నరేంద్ర మోదీ స్వచ్ఛమైన పాలన పట్ల తమ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనబరిచారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల మాదిరిగానే కర్నాటక ప్రజలు కూడా మోదీ నాయకత్వం పట్ల తిరుగులేని విశ్వాసాన్ని కనబర్చడంతోపాటు ఆయన పారదర్శక పాలనలకు, అభివృద్ధి అనుకూల విధానాలకు మద్దతు తెలిపారన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడానికి పార్టీ శ్రేణులు అవిశ్రాంతంగా శ్రమించాయని, వాటి కృషి ఫలితంగానే అతిపెద్ద పార్టీగా అవతరించగలిగామని అమిత్ షా అన్నారు. గత ఐదేళ్లుగా సాగిన కాంగ్రెస్ అవినీతి పాలనను తిరస్కరించడంతోపాటు దాని కులతత్వాన్ని కూడా ప్రజలు వ్యతిరేకించారని చెప్పడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. అయితే తాము అదిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారంలోకి రాకుండా చేయడానికి కాంగ్రెస్ కుత్సిత వ్యూహాలకు పాల్పడుతోందన్నారు. అయితే కాంగ్రెస్ తప్పుడు ఆలోచనలను, విధానాలను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారని, దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ కాంగ్రెస్ తీరు ఇదేనన్న నిజాన్ని గ్రహించారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో మాట్లాడిన అమిత్ షా కర్నాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని చెప్పడానికి నిదర్శనమని, అలాగే బీజేపీకి ఇది 15వ విజయమని షా పేర్కొన్నారు.
చిత్రాలు.. ప్రధాని నరేంద్ర మోదీ
*ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విజయ దరహాసం