జాతీయ వార్తలు

నా భర్తను భారత్‌కు రప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వదోదర, మే 15: పాకిస్తాన్ జైల్‌లో మగ్గుతున్న తన భర్త కేన్సర్‌తో బాధపడుతున్నాడని, ఆయనకు మెరుగైన వైద్యం కోసం స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని రుడీబెన్ చౌహాన్ (32) వేడుకుంటోంది. గిర్ సోమనాథ్ జిల్లా మత్స్యకారుడైన ఆమె భర్త దానాభాయ్ చౌహాన్ (35) సముద్రంలో వేటకెళ్లి పాక్ మెరైన్ సెక్యూరిటీ సిబ్బందికి చిక్కాడు. కచ్ జిల్లాలోని జఖువాపోర్టులో 2017 మే 3న ఈ సంఘటన చోటుచేసుకుంది. అప్పటి నుంచీ దానాభాయ్ పాకిస్తాన్ జైలులోనే కాలంగడుపుతున్నాడు. తన భర్త కేన్సర్‌తో బాధపడుతున్నాడని రుడీబెన్ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవల్సిందిగా కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఆమె లేఖ రాసింది. మూడు రోజుల క్రితం పాక్‌లోని ఓ ఆసుపత్రి నుంచి దానాభాయ్ తన మేనల్లుడికి ఫోన్ చేశాడు. మంచి వైద్యం దొరికితే బతుకుతానని, తనను భారత్ తీసుకెళ్లాలని కోరాడు.‘నా భర్తకు పాకిస్తాన్ జైలులో చనిపోవడం ఇష్టం లేదు. స్వదేశానికి వచ్చేయాలని ఆశిస్తున్నాడు’అని ఆమె పేర్కొంది. చౌహాన్ దంపతుల సంతానం నలుగురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. తన భర్త యోగక్షేమాల గురించి పాక్ జైలు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. అలాగే అక్కడి భారత హైకమిషన్ నుంచి కూడా ఎలాంటి సహాయ, సహకారం అందడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో మీరే ఆదుకోవాలంటూ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఆమె లేఖ రాశారు.
రోజుకు వంద రూపాయల కూలీతో రుడీబెన్ చౌహాన్ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఇటీవల గిర్ సోమ్‌నాథ్ జిల్లాకు వచ్చిన ఎంపీ పరిమళ్ నాథ్‌వనీ, గుజరాత్ ఫిషర్‌మెన్స్ అసోయేషన్ ఉపాధ్యక్షుడు వెల్జ్భియ్ మసానీకీ ఆమె విడివిడిగా లేఖలు అందించింది. ఆరోగ్య కారణాల రీత్యా దానాభాయ్‌ను స్వదేశానికి రప్పించాలని ఆమె విజ్ఞప్తి చేసింది.