జాతీయ వార్తలు

నేనేం తప్పుకోను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: కాంగ్రెస్ పార్టీ పంజాబ్ వ్యవహారాల ఇంచార్జిగా నియమితురాలైన వివాదాస్పద నేత ఆశాకుమారి తాను బాధ్యతల నుంచి తప్పుకునే ప్రశే్నలేదని సోమవారం స్పష్టం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఈ కాంగ్రెస్ నేత భూకబ్జా కేసులో ఏడాది జైలుశిక్ష పడి బెయిలుపై ఉన్నారన్న సంగతి తెలిసిందే. నేరచరితులకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యతలు అప్పగించటంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆశాకుమారి ఎంపికపై బిజెపి, శిరోమణి అకాలీదల్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పెద్దఎత్తున విమర్శలు గుప్పించటంపై ఆమె స్పందించారు. ‘‘ఇది విషయమే కాదు. నాకు సోనియా మేడమ్ పూర్తి అండదండలు ఉన్నాయి. ఎవరి డిమాండ్లకు తలొగ్గే ప్రశే్నలేదు. కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు నన్ను పంజాబ్‌లో పార్టీకోసం పనిచేయమని ఆదేశించారు’’ అని ఆమె అన్నారు. ఆశాకుమారి హిమాచల్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ బంధువు. డల్‌హౌసీ నియోజకవర్గం నుంచి ఆమె ఇప్పటికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదట పంజాబ్ వ్యవహారాల బాధ్యతను సీనియర్ నేత కమల్‌నాథ్‌కు అప్పగించినప్పటికీ, 1984 సిక్కుల అల్లర్ల కేసులో ఆయనపై ఆరోపణలు తలెత్తడంతో ఆయన రాజీనామా చేశారు. ఇప్పుడు ఆశాకుమారి ఎంపిక సైతం వివాదమయింది. ఏ రాష్ట్రంలో ఎవరికి పార్టీ బాధ్యతలు అప్పగించాలనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించజాలదని ఆమె వ్యాఖ్యానించారు.

చిత్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆశా కుమారి