జాతీయ వార్తలు

బాలికలను వెంటాడుతున్న లైంగిక వేధింపుల భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, మే 15: కౌమారంలో అడుగుపెట్టిన బాలికలను లైంగిక వేధింపులు ఎదురవుతాయన్న భయం వెంటాడుతుంటుంది. ప్రతి ముగ్గురు బాలికల్లో ఒకరిని లైంగిక వేధింపుల భయం, ప్రతి ఐదుగురిలో ఒక బాలికను లైంగిక దాడులు, అత్యాచారానికి గురవుతామేమోనన్న భయం వెంటాడుతుంటుంది. బహిరంగ ప్రదేశాల్లో బాలికల సేఫ్టీ అనే అంశంపై సేవ్ ది చిల్ట్రన్ అనే ఎన్జీవో సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేకు వింగ్స్ 2018 అని నామకరణం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురైన బాలికలు తల్లికి బాధను చెప్పుకుంటారు. ఆ తర్వాత బాలికల కదలికలపై ఆంక్షలు మొదలవుతాయి. భారతదేశ వ్యాప్తంగా నాలుగు వేల మంది బాలబాలికలు, ఎనిమిద వందల మంది తల్లితండ్రుల నుంచి అభిప్రాయాలను ఈ సంస్థ సేకరించించి. ఈ సర్వేను ఆరు రాష్ట్రాల్లో, 12 జిల్లాల పరిధిలో 30 నగరాలు, 84 గ్రామాల్లో నిర్వహించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, అస్సాం, మధ్య ప్రదేశ్‌లో జరిపిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఈ నివేదికను కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పూరి విడుదల చేశారు. మహిళలు, బాలికలను భాగస్వామ్యం చేసే విధంగా విధానాలను ప్రభుత్వం రూపొందించాలన్నారు. 2022 నాటికి సంపూర్ణ్భావృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కేంద్రమంత్రి మనే కా గాంధీ మాట్లాడుతూ, సమాజంలో బాలికలు, మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. అప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. భారత్ ప్రభుత్వం పోక్సో చట్టం 2012, ఈ చట్టానికి సవరణలు తెస్తూ 2013లో చట్టాలు చేసిందన్నా రు. సురక్షితంగా బాలికలు ఉండేందుకు ప్రజలు, కుటుంబాలు కూడా తమ వంతు కృషి చేయాల్సి ఉంటుందన్నారు.