జాతీయ వార్తలు

గోవాకు కన్నడ సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పానాజి, మే 17: అధికారం చేపట్టడానికి అవసరమైన పూర్తి మెజారిటీ లేకున్నా ఏకైక అతిపెద్ద పార్టీ అయిన బీజేపీని సీఎం పీఠంపైకి ఆహ్వానిస్తూ గవర్నర్ వాజుభాయి వాలా తీసుకున్న నిర్ణయం ప్రభావం గోవా రాష్ట్రంపై పడింది. రాష్ట్రంలో తమది కూడా ఏకైక అతిపెద్ద పార్టీ అని, తమను కాకుండా గోవా ఫార్వర్డ్, పార్టీ, ఎంజిపి పార్టీల సంకీర్ణంతో ఏర్పడిన బీజేపీకి గతంలో ఎలా అధికారాన్ని ఇచ్చారని కాంగ్రెస్ ఇప్పుడు ప్రశ్నిస్తోంది. కర్నాటకలో పిలిచిన విధంగానే గోవా రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీ అయిన తమను అధికారంలోకి పిలవాలని ఆ పార్టీ సీఎల్పీ నేత చంద్రకాంత్ కవలేకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తాము గవర్నర్ మృదుల సిన్హాకు తమ పార్టీ తరఫున లేఖను సమర్పించనున్నట్టు చెప్పారు.
40 మంది సభ్యులున్న అసెంబ్లీలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే అధికారం చేపట్టడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌కు 21కు నాలుగు సీట్లు తక్కువయ్యాయి. అదే సమయంలో బీజేపీకి 14 సీట్లు రాగా, గోవా ఫార్వర్డ్ పార్టీ మూడు, ఎంజిపి మూడు సీట్లు గెల్చుకోగా, బీజేపీ ఈ రెండు పార్టీలు, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులతో పొత్తుపెట్టుకుని గోవాలో అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఇప్పుడు కర్నాటకలో ఏకైక అతిపెద్ద పార్టీని అధికారంలోకి పిలిచిన విధంగా తమను కూడా అధికారంలోకి ఆహ్వానించి గత సంవత్సరం గవర్నర్ తాను చేసిన తప్పును సవరించుకోవాలని కవలేకర్ డిమాండ్ చేశారు.
ఒకసారి తమకు అవకాశం ఇస్తే అధికారానికి అవసరమైన 21మంది సభ్యులతో మెజారిటీని నిరూపించుకుంటామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు గవర్నర్లు రెండు విధానాలు అవలంబించడం సబబు కాదని అన్నారు. ఇప్పుడు కర్నాటకలో గవర్నర్ పాటించిన విధానానే్న గోవాలో కూడా పాటించి తమను అధికారంలోకి ఆహ్వానించి గతంలో చేసిన తప్పును గవర్నర్ సరిదిద్దుకోవాలని అన్నారు.
బీజేపీ ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అమెరికాలో వైద్య చికిత్స పొందుతున్నారని, రెండు నెలల నుంచి రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తమైందని, తమకు ఒక అవకాశం కల్పిస్తామని స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.