జాతీయ వార్తలు

కర్ణాటక కేసు తెల్లవారుజామున విచారించాల్సిన అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: కర్నాటక గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై తక్షణం విచారణ జరపాలని కోరుతూ బుధవారం రాత్రి కాంగ్రెస్-జెడీఎస్‌లు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది రోహిద్గీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనిపై ఆయన వాదిస్తూ, ఇదేమీ 2015లో ముంబయి దాడుల కేసులో ఉరిశిక్షకు గురైన యాకుబ్ మెమెన్ కేసనుకున్నారా? అంటూ ప్రశ్నించారు. అప్పుడంటే మెమెన్‌ను ఉదయం 6 గంటలకు ఉరితీయాల్సి ఉన్నది కనుక, కొంతమంది లాయర్లు, మానవహక్కుల కార్యకర్తలు వేసిన పిటిషన్‌ను కోర్టు అర్థరాత్రి విచారించింది. అది సముచితమే. కానీ ఇప్పుడెవరికి ఉరిశిక్షపడింది? అంటూ ఆయన అన్నారు. దీనికి కాంగ్రెస్-జెడిఎస్ తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ అనూప్ జార్జ్ చౌదరి సమాధానమిస్తూ, ‘కర్నాటకలో రాజ్యాంగాన్ని ఉరితీస్తున్నారు’ అన్నారు. చౌదరితో పాటు అభిషేక్ మను సింఘ్వి కూడా కాంగ్రెస్-జెడిఎస్‌ల తరపున తమ వాదనలు వినిపించారు.