జాతీయ వార్తలు

నదీ తీరాలు, బీచ్‌ల పరిశుభ్రతకు కేంద్రం శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 17: దేశ వ్యాప్తంగా ఉన్న నదీ తీరాలు,బీచ్‌లకు,సరస్సులను పరిశుభ్రం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2018 జూన్ 5 వరకు దేశంలోని నది తీరాలు, బీచ్‌లు, సరస్సులను శుభ్రం చేసేందకు 19 ప్రత్యేక బృందాలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పా టు చేసింది. అందులో తొమ్మిది సముద్ర తీర రాష్ట్రాలలోని 24 బీచ్‌లు, సరస్సులు, 19 రాష్ట్రాలలోని 24 నదీ తీరాలను శుభ్రం చేయనున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, తెలంగాణలోని మూసీ నదులు ఉన్నా యి. అలాగే ఏపీలోని మైపాడు బీచ్, కొత్తకొడూరు బీచ్‌లు, పులికాట్ సరస్సులు కేంద్రం గుర్తించిన వాటిలో ఉన్నాయి. ఈ బృందాలతో పా టు స్థానిక అధికారులు, విద్యార్థులు, పర్యావరణవేత్తలు, సంస్థలు ఈ డ్రైవ్‌లో పాల్గొననున్నట్టు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు.