జాతీయ వార్తలు

2050 నాటికి పట్టణాల్లో 50 శాతం జనాభా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: దేశంలో 2050 నాటికి నగరాల్లో జనాభా ఊహించని స్థాయిలో పెరిగిపోతుందని, ఇంచుమించు దేశజనాభాలో సగం వరకు నగరాల్లోని నివసిస్తారని, వారికి అవసరమైన సదుపాయాల కల్పనకు గృహ, వౌలికసదుపాయాల విభాగాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందని, వాటిని తీర్చడానికి ఇప్పటి నుంచే హరితభవనాలు అభివృద్ధి లాంటి చర్యలు అవసరమని ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. నౌరోజినగర్‌లో వరల్డ్ ట్రేడ్‌సెంటర్ ఏర్పాటుకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంవత్సరానికి ఏడు నుంచి 7.5 శాతం ఆర్థిక పెరుగుదల సాదించడానికి మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందని అన్నారు. మన పర్యావరణాన్ని కాపాడుకుంటూనే వనరులను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2011లో 31.7 శాతం జనాభా పట్టణ ప్రాతాల్లో ఉండేదని, 2050 నాటికి ఈ సంఖ్య 50 శాతానికి పెరగుతుందని అన్నారు. అంటే 2050 నాటికి పట్టణ ప్రాంతాల్లో జనాభా సంఖ్య 80 కోట్లకు చేరుతుందని వారందరికీ అవసరమైన ఇళ్లు, ఇతర సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా రోడ్లు, 24 గంటలు విద్యుత్, తగినంత నీటిసరఫరా, వ్యర్థాల తరలింపు, రవాణా, ఎయిర్‌పోర్టు, సీపోర్టు ఇలా అన్ని రంగాలను ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలన్నారు. ముఖ్యంగా హరిత భవనాలు, విద్యుత్ ఉత్పత్తి విధానాలను పెద్దయెత్తున అభివృద్ధి చేయాలని, వీటిపై పౌరుల్లో అవగాహన తీసుకురావాలని ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు సూచించారు.