జాతీయ వార్తలు

ప్రకృతిని ప్రేమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 17: స్వచ్చత వ్యర్థాల నిర్వహణపై ఆంధ్రభవన్ ప్రత్యేక కమిషనర్ రజత్ బార్గవ్ రచించిన ‘ఏ ట్రిటిస్ ఆన్ క్లీన్‌లినెస్’,‘వేస్ట్ మేనేజ్‌మెంట్’పుస్తకాలను ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు అవిష్కరించారు. వెంకయ్య నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ పుస్తకాల అవిష్కరణ కార్యక్రమం జరిగిం ది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రకృతిని మనమందరం ప్రేమించాలని పిలుపునిచ్చారు. ప్రకృతి ఇప్పటి వరకు మనకు ఎంతో ఇచ్చిందని దాన్ని స్వచ్ఛగా ఉంచి భవిష్యత్తు తరాలను అందించాలని ప్రజలను కోరారు.ఎక్కడ స్వచ్ఛత ఉంటుందో అక్కడే మనకు స్పూర్తి కూడా లభిస్తుందని, స్వచ్ఛత ఉంటేనే ఎవరికైన మంచి ఆలోచనలు వస్తాయాని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రకృతిని పంట్టించుకొవడ తగ్గుతుందని దాని వల్ల,అనేక సమస్యలు వస్తాయాని పేర్కొన్నారు.పరిశరాలు పరిశుభ్రత కోసం ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పలుపునిచ్చారని వెంకయ్య అన్నా రు. ఈ పుస్తక అవిష్కరణ కార్యక్రమానికి కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ , పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్, ఐటీ శా ఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్, రజత్ భార్గవ్ కుంటుంబ సభ్యులు, ఏపీ, తెలంగాణ భవన్ల్ ఆర్సీలు ప్రవీణ్ ప్రకాశ్, అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.