జాతీయ వార్తలు

క్లర్క్ నుంచి సీఎం దాకా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటే యెడ్యూరప్ప ఎట్టకేలకు కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి న భాజపాను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో, యెడ్యూరప్ప 23వ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యా రు. గవర్నర్ విధించిన 15 రోజుల గడువులోగా ఆయన బలపరీక్షలో నెగ్గితేనే ప్రభుత్వం నిలుస్తుంది.
బూకనాకెర్ సిద్దలింగప్ప యెడ్యూరప్ప (75) తన 15వ ఏటనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘలో చేరారు. తర్వాత జనసంఘ్‌లో చేరారు. శివమొగ్గ జిల్లాలోని, శికారిపుర తా లూకాకు 1970 ప్రాంతంలో పార్టీ ఇన్‌చార్జ్‌గా పనిచేశా రు. శికారిపుర ఆయన స్వస్థలం. ప్రస్తుతం శివమొగ్గ నుం చి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న యెడ్యూరప్ప, 1983లో మొ ట్టమొదటిసారి లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. కర్నాటకలో బలీయమైన లింగాయత్ వర్గానికి చెందిన యెడ్యూరప్ప, రైతుల సమస్యలపై గతంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. బీఏ పట్ట్భద్రుడైన ఆయన ఎమర్జెన్సీ సమయంలో జైలుశిక్ష అనుభవించారు.
మొదట్లో సాంఘిక సంక్షేమ శాఖలో క్లర్క్‌గా పనిచేసి, తర్వాత శివమొగ్గలోని ఒక రైస్‌మిల్లులో అదే పనిలో చే రారు. ఆ తర్వాత హార్డ్‌వేర్ షాపును నడిపారు.
2004లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించిన స మయంలోనే, వరించాల్సిన ముఖ్యమంత్రి పదవి, కాం గ్రెస్-జెడీ(ఎస్)లు జట్టు కట్టడంతో చేజారిపోయింది. కాంగ్రెస్ నేత ధరమ్‌సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. తర్వాత మైనింగ్ స్కాంలో ముఖ్యమంత్రిని లోకాయుక్త తప్పుపట్టడంతో 2006లో యెడ్యూరప్ప, కుమారస్వామితో చేతులు కలిపి ధరమ్ సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. రోటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి పదవులు చేపట్టాలన్న ఒప్పందం మేరకు కుమారస్వామి ముఖ్యమంత్రి కాగా, యెడ్యూరప్ప ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2007లో అంగీకారం ప్రకారం యెడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటికీ అది వారం రోజుల ముచ్చటే అయింది. కుమారస్వామి ఎదురు తిరగడంతో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. 2008లో యెడ్యూరప్ప మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అక్రమ మైనింగ్ కేసులో అప్పటి లోకాయుక్త ఎన్. సంతోష్ హెగ్డే తప్పుపట్టడంతో 2011లో పదవికి రాజీనామా చేయక తప్పలేదు. నిజానికి 2008లో అంతా తానై యెడ్యూరప్ప పార్టీని గెలిపించారు. ఆవిధంగా దక్షిణాదిలో తొలి భాజ పా ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత బెంగళూరులో తన కు మారులకు అక్రమంగా భూములు కేటాయించారంటూ వచ్చిన ఆరోపణలు పెద్ద దుమారం రేపాయి. తర్వాత మైనింగ్ కేసులో లోకాయుక్త తప్పు పట్టడంతో 2011లో రాజీనామా చేసి, అదే ఏడాది అక్టోబర్‌లో లోకాయుక్త కోర్టులో లొంగిపోయారు. లోకాయుక్త ఆయనకు వారం పాటు జైలుశిక్ష విధించారు. ఇది భాజపాకు శరాఘాతమైంది. తర్వాత పార్టీని వీడిన ఆయన కర్ణాటక జనతా పక్ష పేరుతో స్వంత పార్టీ పెట్టినా ముందుకు సాగలేదు. కానీ 2013లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో పదిశాతం ఓట్లు సాధించి, ఆరు సీట్లలో గెలిచి భాజపా విజయావకాశాలను దెబ్బతీశారు. తర్వాత యెడ్యూరప్ప భవిష్యత్తు అనిశ్చితిలో పడటం, భాజపాకు రాష్ట్రంలో నాయకుడి అవసరమవడంతో, కెజేపీని యెడ్యూరప్ప భాజపాలో విలీనం చేశారు. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్టల్రోని మొత్తం 29 స్థానాల్లో 19 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. పార్టీకి మొత్తం 19.9 శాతం ఓట్లు వచ్చాయి. అయితే యెడ్యూరప్పను గతకాలపు అవినీతి ఆరోపణ లు వెన్నంటే ఉండటం భాజపాకు ఇబ్బందిగా మారింది. ఎట్టకేలకు 2016, అక్టోబర్ 26న సీబీఐ కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించడంతో బయటపడ్డారు.