జాతీయ వార్తలు

ప్రజాస్వామ్యం గెలిచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 20: కర్నాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందని సూపర్ స్టార్ సినీనటుడు, రాజకీయ పార్టీ ఏర్పాటుకు సమాయత్తమవుతున్న రజనీకాంత్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ మెజార్టీని తెచ్చుకోవాలని, కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విశ్వాస పరీక్షలో విజయాన్ని నమోదు చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, కర్నాటక గవర్నర్ కూడా యెడ్యూరప్పకు 15 రోజుల పాటు విశ్వాస పరీక్షకు గడువు ఇవ్వడం సరికాదన్నారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకూడదన్నారు. సుప్రీం కోర్టు కూడా సకాలంలో జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందన్నారు. అనంతరం ఆయన రజని మక్కర్ మంద్రం అనే మహిళా సాధికారత సంస్థ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కావేరి జలాలను కర్నాటకకు విడుదల చేయాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పుకు కర్నాటక ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. కావేరి అథారిటీకి డ్యాంల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించాలన్నారు. రానున్న రోజుల్లో ఏమి జరుగుతుందో వేచి చూస్తామన్నారు.