జాతీయ వార్తలు

విపక్షాల కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 24: గత మూడు రోజులుగా హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న తమిళనాడులోని తూత్తుకుడిపై ఎట్టకేలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.పళనిస్వామి నోరువిప్పారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు, సంఘవిద్రోహక్తులతో చేతులు కలపడం వల్లే తూత్తుకుడిలో హింస చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని పార్టీల నేతలు సంఘ విద్రోహశక్తులను రంగంలోకి దింపి హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారని విమర్శించారు. స్టెరిలైట్ యూనిట్‌ను మూసివేయాలని తూత్తుకుడి జిల్లాలోని పలు గ్రామాలు ప్రజలు జరిపిన ఆందోళన హింసాత్మకంగా మారి పోలీసు కాల్పులకు దారితీసిన విషయం తెలిసిందే. కాల్పుల్లో మొదటిరోజైన మంగళవారం 10 మంది, బుధవారం ఒకరు, గురువారం ఇద్దరు మృతి చెందారు. జరుగుతున్న సంఘటనలపై ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారని ఆయన చెప్పారు. కొందరు విద్రోహశక్తులు ఆందోళనకారులతో కలిసిపోయి ఈ హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. ఇలాంటి చర్యలతో తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అస్థిరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. జరిగిన సంఘటనలు దురదృష్టకరమని, ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని కోరారు. స్టెరిలైట్ యూనిట్‌ను మూసివేయడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్లాంట్‌ను మూసివేయడానికి జయలలిత అధికారంలో ఉన్న 2013 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. తాము ప్రజల మనోభావాలను గౌరవిస్తామని ఆయన చెప్పారు. జిల్లా అధికారులు తూత్తుకుడి సమస్యపై గత నాలుగైదు నెలల్లో 14 సమావేశాలు నిర్వహించారన్నారు. ప్లాంట్ మూసివేతపై తాము తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఏప్రిల్ 14న దినపత్రికల్లో అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇచ్చిన విషయాన్ని పళనిస్వామి గుర్తు చేశారు.
తూత్తుకుడి సంఘటనలో పోలీసుల వ్యవహార శైలిని నిరసిస్తూ శుక్రవారం తమిళనాడు రాష్ట్రంలో బంద్ నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకె, ఇతర విపక్షాలు నిర్ణయించాయి. స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసివేయాలని తూత్తుకుడి జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టగా నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇంతవరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల చర్యను ఖండిస్తూ, స్టెరిలైట్ ఫ్యాక్టరీని పూర్తిగా మూసివేయాలని నిర్ణయిస్తూ డిఎంకె, కాంగ్రెస్, ద్రవిడ కజగం, మరుమలార్చి ద్రవిడ మున్నీత్ర కజగం, సీపీఐ సీపీ(ఎం), ఆల్ ఇండియాముస్లింలీగ్ తదితర పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా బంద్ నిర్వహించనున్నారు. తొలుత మే 25న జిల్లా కేంద్రాలలో నిరసన వ్యక్తం చేయాలని డిఎంకె పిలుపునిచ్చింది. అయితే తర్వాత అన్ని పార్టీలు కలిసి శుక్రవారం రాష్టబ్రంద్ చేపట్టాలని నిర్ణయించాయి.
ప్రశాంతంగా ఉండాలి: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: తమిళనాడు ప్రజలు శాంతంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ కోరారు. పోలీసుల కాల్పుల్లో 13 మంది మృతి చెందడం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనలు విచారకరమని, ప్రజలు సహనాన్ని కోల్పోకుండా శాంతిభద్రతలను కాపాడాలని ఆయన కోరారు.

చిత్రాలు..తూత్తుకుడి కాల్పుల ఘటనకు నిరసనగా గురువారం చెన్నైలో ఆందోళన చేస్తున్న విపక్షాలు.
ఇన్‌సెట్‌లో *డీఎంకే నేత స్టాలిన్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు *తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి