జాతీయ వార్తలు

నిరుపేదల చెంతకు అభివృద్ధి ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు దేశంలోని అత్యంత నిరుపేదలకు అందుతున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పటివరకు తమ ప్రభుత్వం సాధించిన విజయాలను సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘గ్రామ స్వరాజ్ అభియాన్’ గురించి వివరిస్తూ ఇది ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక పథకంగా వర్ణించారు. ఏప్రిల్ 14 నుంచి మే 5వ తేదీ వరకు దేశంలోని 16,850 గ్రామాలకు చెందిన అత్యంత నిరుపేదలకు అభివృద్ధి ఫలాలు అందడం, నిజంగా అంబేద్కర్‌కు అర్పించిన ఘనమైన నివాళి’ అని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్య అభియాన్ కింద వివిధ టీంలు మారుమూల గ్రామాల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఏడు ప్రముఖ పథకాలు అమలయ్యేలా చూశాయన్నారు. ఇంటిముంగిటనే సేవలు అందేలా చూసిన అద్భుతమైన ఉద్యమం ఇది అని అభివర్ణించారు. దీనివల్ల పేదల జీవితం మరింత సౌకర్యవంతమవుతుందన్నారు. ‘21 రోజు పాటు నిర్వహించిన గ్రామ స్వరాజ్ అభియాన్ కింద, 7.53 లక్షల ఉజ్వల కనెక్షన్ల పంపిణీ పూర్తయింది. సౌభాగ్య యోజన కింద 5,02,434 ఇళ్లకు విద్యుత్ సదుపాయం కల్పించారు. 16,682 గ్రామాల్లో 25.03 లక్షల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేశారు. మిషన్ ఇంద్రధనుష్ కింద 1,64,398 మంది పిల్లలు, 42,762 మంది మహిళలకు ఇమ్యూనైజేషన్ అమలు జరిపారు’ అని వివరించారు. ఇదే కాలంలో కొత్తగా 20,53,599 మంది జన్‌ధన్ లబ్దిదారులు చేరారు.
ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన కంద 16,14,388 మంది లబ్దిదారులు, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద మరో 26,10,506 మంది లబ్దిదారులు చేరారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చురుగ్గా పాల్గొనడం వల్లనే ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని ప్రశంసించారు. మే 26 నాటికి మోదీ ప్రభుత్వం అధికరంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతుంది.