జాతీయ వార్తలు

మీది అధికార దాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: అధికారదాహంతోనే బీజేపీ వ్యతిరేక శక్తులు పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి కూటమి ఏర్పాటుకు తహతహలాడుతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. పరిమితులు దాటి రాజకీయాలను అపహాస్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశాభివృద్ధికి కాంగ్రెస్ అడ్డుతగులుతోందని, బడు గు బలహీనవర్గాలు, దళితులంటే ఆ పార్టీకి గౌరవం లేదని దుయ్యబట్టారు. ఆదివారం మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ గ్రామీణ మహిళలకు మరుగుదొడ్లు నిర్మించాలన్న ప్రణాళికను జోక్‌గా తీసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాలను పెంచిపోషించిన కాంగ్రెస్‌కు ప్రజాసంక్షేమం, అభివృద్ధి వంటబట్టలేదన్నారు. మోదీని వ్యతిరేకించడం తప్ప మరో అజెండా కాంగ్రెస్‌కు లేదన్నారు. ‘వారికి వారి కుటుంబమంటేనే దేశం. కాని నాకు నా దేశమే కుటుంబం’ అని రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శలు చేశారు. అధికార దాహంతో రాజకీయాలు చేస్తే దేశ సమగ్రత దెబ్బతింటుందని హితవు పలికారు. బీజేపి ప్రభుత్వం
చేపట్టిన దళిత సంక్షేమ విధానాలను ఈ సందర్భంగా మోదీ వివరించారు. దళితులపై దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశామన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవపట్టిస్తూ ప్రకటనలు చేస్తోందన్నారు.
నెహ్రూకు ఘన నివాళి
తొలి ప్రధాని పండిత జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఘనంగా నివాళులు అర్పించారు. 1857 మేలో జరిగిన సిపాయిల తిరుగుబాటు ఘటనను ప్రస్తావిస్తూ, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వీరసావర్కర్ త్యాగనిరతిని కొనియాడారు. భారతీయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు జరిగిన కుట్రకు ప్రతీకారంగా 1857 తిరుగుబాటు వచ్చిందన్నారు. ఇది కేవలం తిరుగుబాటుగా చూడరాదని, స్వాతంత్య్రం కోసం భారత్ చేసిన ప్రథమ సంగ్రామంగా పరిగణించాలని వీరసావర్కర్ పేర్కొన్నారని మోదీ చెప్పారు. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ ఘటనలు జరిగి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ ఎత్తున వీరసావర్కర్ ఉత్సవాలను లండన్‌లోని ఇండియా హౌస్‌లో నిర్వహించారన్నారు. వీర సావర్కర్ గొప్ప కవి, సాహితీవేత్త, సంఘసంస్కర్తని, దేశ సమగ్రత కోసం పోరాడిన యోధుడని కీర్తించారు. అలాగే, రంజాన్ మాసం సందర్భంగా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.