జాతీయ వార్తలు

ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఊమెన్ చాందీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఆ పార్టీ నేత కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కాంగ్రెస్ పార్టీ నియమించింది. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను తొలగించి ఆయన స్థానంలో ఊమెన్ చాందీకి ఆంధ్ర కాంగ్రెస్ పర్యవేక్షక బాధ్యతలు అప్పగించింది. ఏఐసీసీ ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీగా ఊమెన్ చాందీని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ పేరుతో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న దిగ్విజయ్ సింగ్ విలువైన సేవలు అందించారని, ఆయన వెంటనే ఆ పదవి నుంచి దిగిపోతారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కేరళలో ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం ఉమెన్ చాందీని ఏపీ ఇన్‌చార్జ్‌గా నియమిస్తారని గతంలో వార్తలు వచ్చినప్పటికీ వివిధ కారణాలవల్ల ఆలస్యమైంది. ఉమ్మడి రాష్ట్రం విభజనకు ముందుగా దిగ్విజయ్ సింగ్‌ను రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా నియమించింది. విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు ఆయనే ఇన్‌చార్జ్‌గా పని చేస్తున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను ఆర్‌సీ కుంతియాకు అప్పగించారు. విభజన అనంతరం కుదేలైన కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్‌చార్జ్‌గా ఊమెన్ చాందీ పార్టీని బలోపెతం చేసేందుకు ఎలా వ్యవహరిస్తారో చూడాల్సివుంది. అలాగే పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులకు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా తరుణ్ గొగోయ్‌ని నియమించారు.