జాతీయ వార్తలు

దేశంలో తొలి సమీకృత రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: సైన్యంలోని త్రివిధ దళాలతో పాటుగా ప్రత్యేక దళాల కమాండ్ అత్యవసర పరిస్థితుల్లో పరిస్థితిని ఆకళింపు చేసుకుని సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా మొట్టమొదటిసారిగా ఒక సమీకృత రక్షణ కమ్యూనికేషన్ వ్యవస్థను గురువారం ప్రారంభించారు. ఈ రక్షణ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ అటు లడఖ్‌నుంచి ఇటు ఈశాన్య రాష్ట్రాల వరకు అండమాన్ నికోబార్, లక్షదీవులులాంటి దీవుల సరిహద్దుల దాకా దేశంలోని ఏ మూలనుంచయినా సమాచారాన్ని సేకరించడమే కాకుండా అందించగలదు. అన్ని సమయాల్లో ఈ వ్యవస్థను భద్రతాపరంగా అత్యంత పటిష్ఠమైనదిగా ఉండేలా చూడాల్సిన అవసరముందని ఈ వ్యవస్థను ప్రారంభించిన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. భద్రతా దళాల్లో అభద్రతా భావం చొరబడకూడదని ఆయన అన్నారు. సైన్యంలోని అన్నిదళాలకు ప్రత్యేకమైన కమాండ్, కమ్యూనికేషన్, ఇంటెలిజన్స్ నెట్‌వర్క్‌లున్నప్పటికీ వాటి మధ్య మరింత సమన్వయానికి ప్రత్యేకంగా కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఆధునిక యుద్ధాల్లో టెక్నాలజీదే కీలకపాత్ర అని, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సైన్యం, సిగ్నల్స్ కోర్ సిద్ధంగా ఉన్నాయని సిగ్నల్స్ విభాగం ఇన్‌చార్జి లెఫ్టెనెంట్ జనరల్ నితిన్ కోహ్లీ చెప్పారు.