జాతీయ వార్తలు

అంతర్జాతీయ స్థాయికి విద్యాసంస్థలు ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 2: ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు అవసరమైన మానవవనరులు దేశంలో లభించడం లేదని, వివిధ విద్యాసంస్థల నుంచి చదువు పూర్తిచేసుకుని వస్తున్న వారి నైపుణ్యాలు సంస్థలకు పనికిరాకుండా పోతున్నాయని, వారి అవసరానికి, వీరి ప్రతిభకు పొంతన లేకుండా పోతోందని మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఇండస్ట్రీకి కావాల్సిన నైపుణ్యాలు అభ్యర్థుల దగ్గర ఉండటం లేదు, అభ్యర్థి నేర్చుకున్న చదువు ఇండస్ట్రీకి ఉపయోగపడటం లేదు అని ఆయన అన్నారు. ఇక్కడ జరిగిన ఒక విద్యాసంస్థ డిగ్రీ ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని 763 యూనివర్సిటీలు, 38 వేల డిగ్రీ, ఇతర విద్యాసంస్థలు, ఐఐఎంలు, ఐఐటిలు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోలేకపోతున్నాయని అన్నారు. రాష్టప్రతిగా తాను పనిచేసిన ఐదేళ్లకాలంలోనూ పలు సందర్భాల్లో తాను ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం రెండు సంస్థలు మాత్రం అంతర్జాతీయంగా గుర్తింపును పొందాయని ఆయన అన్నారు. అయితే ఇది సరిపోదని, దేశంలోని ప్రతి విద్యాసంస్థ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 2022 సంవత్సరానికి భారతదేశంలో 50 శాతం జనాభా 25 సంవత్సరాలలోపు వారుఉంటారని ఆయన చెప్పారు. యువజనాభా మన దేశానికి వరంలాంటిదని అన్నారు. అయితే ఈ అంశాన్ని ఇంకోవైపు చూస్తే వారందరినీ ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యవంతులుగా తయారు చేయకపోతే కేవలం గ్రాడ్యుయేట్లు, పోస్టుగ్రాడ్యుయేట్లుగా మిగిలిపోతారే తప్ప వారు ఇండస్ట్రీకి కావాల్సిన మేన్‌పవర్‌గా మారలేరని, నిరుద్యోగిత మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ పరిస్థితిని అధగమించడానికి ఇప్పటినుంచే విద్యావిధానాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. దీనికోసం ఇండస్ట్రీని, అకాడమీని అనుసంధానం చేయాలని అన్నారు. ఇండస్ట్రీకి ఏమి అవసరమో అదే విద్యార్థులకు బోధించాలని, ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలని, డిగ్రీతో బయటకు వచ్చిన ప్రతి విద్యార్థి ఉద్యోగిగా మారడానికి అన్ని నైపుణ్యాలు కలిగి ఉండాలని అన్నారు.