జాతీయ వార్తలు

కదిలిన మాజీ సీఎంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 2: అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలంటూ మాజీ సీఎంలకు సుప్రీం కోర్టు విధించిన గుడువుకు ఒకరోజు ముందే మాజీ సీఎంలు కదలిక మొదలైంది. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్‌లు వీవీఐపీ అతిధి గృహానికి బస మార్చుకున్నారు. అదేవిధంగా మాయావతి ఒక అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తూ, తానుంటున్న రెండో భవంతిని బీఎస్పీ ఫౌండర్ కాన్షీరామ్ స్మారక కేంద్రంగా మార్చాలని కోరుతున్నారు. ‘ములాయం సింగ్ యాదవ్ నిన్ననే వీవీఐపీ అతిధి గృహానికి మారిపోయారు. ఆయన కుమారుడు అఖిలేష్, భార్య, ఎంపీ డింపుల్, పిల్లలు సహా శనివారం వీవీఐపీ అతిధి గృహానికి మారారు. ములాయం, డింపుల్, అఖిలేష్‌కు అతిధిగృహంలో ఒక్కొక్కరికీ ఒక్కో గది కేటాయించాం’ అని అతిధి గృహం ప్రధాన నిర్వహణాధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. అయితే, వీళ్లకు కేటాయించినవన్నీ ఫస్ట్ఫో్లర్‌లోని డబుల్ రూం సూట్‌లేనని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కొక్కరికీ మూడు రోజులకు మించి గదులు కేటాయించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. గడువు ముగిసిన తరువాత అదే గదిని మరోసారి బుక్ చేసుకోవడంగాని లేదా గడువు పొడిగించుకోవడంగాని చేయాల్సి ఉంటుందని అంటున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో, మాజీ సీఎంలు అంతా తమతమ అధికారిక భవనాలను ఖాళీ చేయాలంటూ ఉత్తరప్రదేశ్ ఎస్టేట్ విభాగం నోటీసులు జారీ చేయడం తెలిసిందే. నోటీసులు అందుకున్న వారిలో నారాయణ్ దత్ తివారి, ములాయం సింగ్ యాదవ్, కల్యాణ్ సింగ్, మాయావతి, రాజ్‌నాథ్ సింగ్, అఖిలేష్ యాదవ్‌లు ఉన్నారు. సుప్రీం కోర్టు విధించిన పదిహేను రోజుల గడువు నేటితో తీరిపోతుంది. ఈనేపథ్యంలో అఖిలేష్, ములాయం వీవీఐపీ గెస్ట్‌హౌస్‌కు షిఫ్ట్ అయ్యారు. తన భర్త జీవిత చరమాంకంలో ఉన్న నేపథ్యంలో బంగ్లాను ఖాళీ చేయడానికి మరికొంత సమయం కావాలంటూ ఎన్‌డి తివారీ భార్య ఉజ్వల తివారీ ఎస్టేట్ విభాగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎన్డీ తివారీకి ‘పండిట్ నారాయణ్ దత్ తివారీ సర్వజన వికాశ్ ఫౌండేషన్’లో ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఎస్పీ సుప్రీమో మాయావతి ఇప్పటికే ప్రభుత్వ అధికారిక నివాస గృహాన్ని ఖాళీ చేశారు. అయితే, ప్రస్తుతం ఆమెవుంటున్న భవంతి పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ స్మారక కేంద్రంగా మార్చారని, అందువల్ల మాయావతి అందులోనే నివాసం ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రిగా గతంలో ఆమెకు కేటాయించిన 6, లాల్‌బహదూర్ శాస్ర్తీమార్గ్‌లోని భవంతిని గత 29నే మాయవతి ఖాళీ చేశారని ఆమె వ్యక్తిగత సహాయ కార్యదర్శి వెల్లడించారు. అయితే, ఇప్పుడు తానుంటున్న 13 ఏ మాల్ ఎవెన్యూ భవంతి పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ స్మారక కేంద్రమని మాయావతి వాదిస్తున్నారు. అయితే మాయావతి వాదనను ఎస్టేట్ విభాగం కొట్టిపారేసింది. ఇప్పుడు ఆమె ఉంటున్న భవంతి కాన్షీరామ్ స్మారక కేంద్రం కాదని, అలాగే, ఇంతకుముందు ఖాళీ చేసిన భవంతి సైతం ఆమె అనధికారికంగా ఆక్రమించుకున్నదేనని చెబుతోంది. 13 ఏ మాల్ ఎవెన్యూ భవంతినే ఆమె సీఎంగా ఉన్నపుడు కేటాయించారని, అదే సమయంలో 6 లాల్‌బహదూర్ శాస్ర్తీ మార్గ్‌లోని భవంతిని అనధికారికంగా ఆక్రమించుకున్నారని చెబుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె 13ఏ మాల్ ఎవెన్యూ భవంతిని ఖాళీ చేయక తప్పదని ఎస్టేట్ విభాగం సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుత సీఎం ఆధిత్యనాథ్‌ను కలిసిన బీఎస్పీ నేతలు, 2011లోనే ఆ భవంతిని కాన్షీరామ్ స్మారక కేంద్రంగా మార్చినట్టు లేఖ అందించారు. అయినప్పటికీ ఖాళీ చేయమంటూ మే 21న నోటీసులు అందడంతో, అప్పటికప్పుడు ‘శ్రీ కాన్షీరామ్ జీ యాద్‌గర్ విశ్రామ్ స్థల్’ పేరిట కమిటీని ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, స్థానిక ఎంపీ 4, కాళిదాస్ మార్గ్‌లోని తన భవంతిని ఖాళీ చేశారు. విపుల్‌ఖండ్ గోమతి నగర్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి అతి దగ్గరలోవున్న తన సొంత 200 స్క్వేర్ మీటర్ల ప్లాట్‌లోకి రాజ్‌నాథ్ షిఫ్టయ్యారు. రాజస్థాన్ గవర్నర్‌గావున్న కల్యాణ్‌సింగ్ సామానులన్నీ ఆయన మనుమడు, యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లోని మంత్రి అయిన సందీప్ సింగ్ అధికారిక నివాసానికి తరలించేశారు.

చిత్రం..విక్రమాదిత్య మార్గ్‌లోని అధికార నివాసాన్ని ఖాళీ చేసిన అఖిలేష్ యాదవ్