జాతీయ వార్తలు

విపక్షాలది తాత్కాలిక బంధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచి, జూన్ 3: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో విపక్షాలు పొత్తుపెట్టుకుని ఏకం కావడాన్ని తాత్కాలిక బంధంగా ఆయన కొట్టివేశారు. ప్రస్తుతం నాయకత్వ విషయంలో ప్రతిపక్షాలు చాలా బలహీన పరిస్థితుల్లో ఉన్నాయని ఆయన అన్నారు. అదే ఎన్డీఏని చూస్తే నరేంద్ర మోదీ నాయకత్వంలో తిరుగులేని విధంగా పటిష్టంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల యూపీ, బిహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో జరిగిన ఉపఎన్నికల్లో ప్రతిపక్షాల విజయాన్ని ఆయన ప్రస్తావిస్తూ విపక్షాలు ఒకటి రెండు సీట్ల విషయంలో అయితే పొత్తు పెట్టుకోవడం సాధ్యం కాని, ఒక రాష్ట్రం, దేశం మొత్తంలో ఏకం కావడం ఇంచుమించు అసాధ్యమని లోక్‌జనశక్తి పార్టీ అధినేత పాశ్వాన్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ విపక్షాలు ఏకమైనా వాటిని నడిపించే అధినేత విషయంలో కచ్చితంగా ఏకాభిప్రాయం కుదరదని అన్నారు. ఆ కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తారు? రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అంత సులువైన విషయం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రధాన పార్టీలన్నీ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారం చేపడతామని కలలు కంటున్న కాంగ్రెస్ యూపీలోని స్థానిక పార్టీ అయిన అఖిలేష్ నాయకత్వాన్ని గాని, మాయావతిని నాయకురాలిగా గాని అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఆశ అత్యాశేనని, ప్రధానమంత్రి పదవి ఇప్పట్లో ఖాళీ కాదని, ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని పాశ్వాన్ ధీమా వ్యక్తం చేశారు.