జాతీయ వార్తలు

నేటి నుంచి గవర్నర్ల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల రెండు రోజుల సదస్సు ఈ నెల 4,5 తేదీల్లో రాష్టప్రతి భవన్‌లో జరుగుతుంది. సోమ, మంగళవారాల్లో జరిగే ఈ సదస్సులో స్వచ్ఛ్ భారత్, అంతరంగిక భద్రత అంశాలపై చర్చిస్తారు. జాతీయ స్థాయి 49వ గవర్నర్ల సదస్సు సందర్భంగా రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. 1949లో గవర్నర్ల తొలి సదస్సు రాష్టప్రతి భవన్‌లో జరిగింది. అప్పట్లో గవర్నర్ల సదస్సుకు భారత్ చివరి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి అధ్యక్షత వహిస్తారు. జూన్ 4న జరిగే సదస్సును రాష్టప్రతి ప్రారంభించిన తర్వాత అనేక అంశాలపై చర్చా కార్యక్రమం ఉంటుంది. ప్రధాని నరేంద్రమోదీ, నీతి అయోగ్ వైస్ చైర్మన్‌తో పాటు జాతీయ భద్రతసలహాదారు అజిత్ దోవల్ గవర్నర్ల సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్నత విద్య, ప్రమాల అమలు, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పన అంశాలపై చర్చిస్తారు. గుజరాత్ గవర్నర్ ఈ సదస్సుకు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాల అభివృద్ధిలో గవర్నర్లు నిర్వహించే పాత్ర, రాజ్యపాల్, వికాస్ కీ రాజ్‌దూత్ తదితర అంశాలపై గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు మాట్లాడుతారు.