జాతీయ వార్తలు

రష్యా సాంకేతిక సహకారంతో... బెంగళూరులో యుద్ధ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా బిలియన్ డాలర్ల వ్యయంతో 200 కమోవ్ క-226టి అనే యుద్ధ హెలికాప్టర్లను రష్యా నుంచి కొనుగోలు చేసే ప్రతిపాదనలను కేంద్రం ఆమోదం తెలిపింది. రష్యన్ హెలికాప్టర్స్ సంస్థ, భారత్ ఏరో స్పేస్ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్య ఈ మేరకు వచ్చే అక్టోబర్ నాటికి ఒప్పందం అమలవుతుంది. ప్రధాని నరేంద్రమోదీ 2015 డిసెంబర్‌లో రష్యా పర్యటన సందర్భంగా యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందానికి పచ్చజెండా ఊపారు. 2016 అక్టోబర్ నాటికి ఇరు దేశాలు సంయుక్త రంగ సంస్థను ఏర్పాటు చేశాయి. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, రష్యన్ హెలికాప్టర్ సంస్థలు కలిసి చాపర్లను ఉత్పత్తి చేస్తాయి. చేతా, చేతక్ హెలికాప్టర్లను మార్చి వాటి స్థానంలో చాపర్లను ఉంచాలని భారత్ నిర్ణయించింది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెండు ఇంజన్లతో పర్వతప్రాంతాల్లో హెలికాప్టర్లు విహరించగలవని రక్షణ శాఖ తెలిపింది.