జాతీయ వార్తలు

చర్చలను సద్వినియోగం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 3: కాశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొనడానికి, రక్తపాతం నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి వేర్పాటువాదులు శాంతి చర్చలు, కాల్పుల విరమణకు ముందుకు రావాలని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పిలుపునిచ్చారు. ద్వైపాక్షిక కాల్పుల ఒప్పందం, శాంతిచర్చలకు కేంద్రం అవకాశం ఇవ్వడాన్ని ఆమె ప్రస్తావిస్తూ కాశ్మీర్ ప్రజలు, నేతలు, వేర్పాటువాదులు ఈ చర్చల ప్రతిపాదనను ఉపయోగించుకునే విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇది రోజూ వచ్చే అవకాశం కాదని ఆమె వ్యాఖ్యానించారు. ఆర్మీ, పోలీసులతో కాశ్మీర్ సమస్య పరిష్కారం కాదని, ఒక్క రాజకీయ చర్చలతోనే ఇది సాధ్యం అవుతుందని మనం తరచూ పేర్కొంటున్నామని, ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని అన్నారు. వివిధ అజెండాలు ఉన్న పార్టీలు, వేర్పాటువాదులు, సంస్థలు, అందరూ ఈ చర్చల్లో పాల్గొని కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొందామని ఆమె సూచించారు. అందరూ ఈ విషయంలో ముందుకు వచ్చి జమ్మూకాశ్మీర్‌ను, దాని ఆర్థిక స్థితిని కాపాడాలని కోరారు. రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణకు ఒప్పుకున్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల ‘వారు ఒప్పుకుంటే మేము శాంతి చర్చలకు సిద్ధం’ అంటూ వేర్పాటువాదులను ఉద్దేశించి ప్రకటన చేశారన్నారు. వేర్పాటువాదులు ఇప్పటికైనా రాష్ట్రంలోని యువతకు గన్, స్టోన్ (రాళ్లు) సంస్కృతి నుంచి విముక్తి కల్పించి సరైన మార్గం చూపాలన్నారు. ఈ విషయంలో తాను ఎవరినీ ఒత్తిడి చేయడంత కాని, నియంతృత్వంతో గాని ఆదేశించడం లేదని ముఫ్తీ పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం కాశ్మీర్‌లో జరిగిన సంఘటనను ఆమె ఈ సందర్భంగా ఉదహరించారు. ఆందోళనలో భాగంగా ఒక యువకుడు రాళ్లు విసురుతున్న సమయంలో ఒక వాహనం కింద పడి మరణించాడని, ఆ యువకుడు ఒక అనాథ అని చెప్పారు. అతను రాళ్లు విసరడమే ఎందుకు పనిగా పెట్టుకున్నాడని, ఈ గన్, స్టోన్ కల్చర్ నుంచి యువతకు మనం విముక్తి కల్పించలేమా? అని ఆమె ప్రశ్నించారు. యువత ఎక్కువగా మిలిటెన్సీ వైపు ఆకర్షితులవుతున్నారని, ఎంతమంది ఎక్కువమంది అటువైపు వెళితే అంత ఎక్కువగా ఇక్కడ ఆర్మీ, సిఆర్‌ఎఫ్, పోలీస్ బలగాలు పెరుగుతాయని అన్నారు. గన్, గ్రనేడ్ దాడులతో మనం ఏమీ సాధించలేమని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన చర్చల అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ఈ అవకాశాన్ని మనం కాని వదులుకుంటే రేపు మనకి ఎవరూ సలహాలివ్వరని, సహాయం చేయరని ఆమె అన్నారు. దేశం దృష్టి అంతా ఇప్పుడు మనమీదే ఉందని, కాశ్మీర్ సమస్యను ఎలా పరిష్కరించుకుంటామా, ప్రజల్ని, ముఖ్యంగా యువతను ఎలా రక్షిస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సీఎం మెహబూబా ముఫ్తీ చెప్పారు.

చిత్రం..శ్రీనగర్‌లో పార్టీ కార్యకర్తల ర్యాలీలో ప్రసంగిస్తున్న సీఎం మెహబూబా ముఫ్తీ