జాతీయ వార్తలు

‘లేటరల్ ఎంట్రీ’ కొలువులకు పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగావున్న 10 జూయింట్ సెక్రటరీ పోస్టుల భర్తీకి మోదీ సర్కారు దరఖాస్తులను ఆహ్వానించింది. ‘లేటరల్ ఎంట్రీ’ పథకం కింద వీరిని ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం అభ్యర్థికి తప్పనిసరిగా జూలై 1నాటికి 40 ఏళ్ల వయసుండాలి. గ్రాడ్యుయేషన్ తప్పనిసరి. వీరిని ప్రభుత్వ సర్వీసులో మూడేళ్ల కాంట్రాక్టు పద్ధతిపై నియమిస్తారు. తర్వాత ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశముంది. నెలకు రూ.1.44 లక్షలనుంచి రూ.2.18 లక్షల వరకు వేతనం చెల్లిస్తారు. కేంద్రంలో ఇదే క్యాడర్ ఉద్యోగులకు అందే సదుపాయాలన్నీ వర్తిస్తాయ. రెవెన్యూ, ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవహారాలు, వ్యవసాయం, రోడ్డు రవాణా, షిప్పింగ్, పర్యావరణం, అటవీ, పౌరవిమానయానం మరియు వాణిజ్య శాఖల్లో ఈ నియామకాలు జరుపుతారు. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇదే క్యాడర్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చునని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు, స్వతంత్ర సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, గుర్తింపు పొందిన పరిశోధనా సంస్థల్లో కనీసం 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. ఇవే అర్హతలున్న ప్రైవేటు సంస్థల ఉద్యోగులు కూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.