జాతీయ వార్తలు

మిలిటెంట్ల కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 10: పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయ. సరిహద్దులు దాటేందుకు ముష్క రులు ప్రయత్నిస్తూ భద్రతా బలగాల కంట పడటంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నా య. ఈ కాల్పుల్లో మొత్తం ఆరుగురు మిలిటెంట్లు హతమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున సరిహద్దును దాటేందుకు
యత్నిస్తున్న కొందరు మిలిటెంట్లను సైన్యం అడ్డుకోగా వారు కాల్పులకు దిగారని భద్రతా బలగాల్లో కీలక అధికారి ఒకరు వెల్లడించారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఆరుగురు ముష్కరులను చంపివేసినట్లు సైన్యం ప్రకటించింది. వాయువ్య కాశ్మీర్ మారుమూల ప్రాంతాల్లోని అడవుల్లో సైన్యం పెద్దఎత్తున గాలిం పు చర్యలు చేపట్టింది. 1989నుంచి ఇప్పటివరకు భారత సైన్యం అమలు పరచిన ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో 70వేల మంది మరణించారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారత్‌లోకి ప్రవేశపెడుతున్నదంటూ పాకిస్తాన్‌పై భారత్ ఆరోపణలు గుప్పిస్తుండగా పాక్ మాత్రం వీటిని కొట్టిపారేస్తోంది.

చిత్రం..వాయువ్య కాశ్మీర్ మారుమూల ప్రాంతాల్లోని
అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు