జాతీయ వార్తలు

ఢిల్లీలో ఘనంగా సత్యదేవుని కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: దేశ రాజధాని ఢిల్లీలో సత్యదేవని కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. గోల్ మార్కెట్‌లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి ధ్యాన మందిరంలో అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో సత్యదేవుని కల్యాణం అశేష భక్తజన వాహిన మధ్య కనులవిందుగా జరిగింది. శనివారం ఇదే ప్రాగణంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ భవన్ నేతృత్వంలో అన్నవరం దేవస్థానం ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సత్యదేవుని కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు.