జాతీయ వార్తలు

ప్రత్యేక అధికారిని నియమించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని స్వీకరించేందుకు ఏ అధికారిని ప్రత్యేకంగా కేటాయించలేదని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి సంబంధించి వివిధ వనరుల ద్వారా పెద్ద ఎత్తున సలహాలు, సూచనలు వేర్వేరు మంత్రిత్వశాఖలకు వస్తాయని కూడా పీఎంఓ పేర్కొంది. ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన దగ్గరినుంచి పీఎంఓ కార్యాలయానికి ఇప్పటివరకు కార్యక్రమానికి అవసరమైన వీడియో, ఆడియో, లిఖిత పూర్వక సమాచారాల వివరాలు తెలపాలంటూ ఆర్‌టీఐ కింద ఆసీమ్ తక్యార్.. సమాచార శాఖ చీఫ్ కమిషనర్ ఆర్.కె. మాథుర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణిలో మన్ కీబాత్ ప్రారంభమైన దగ్గరినుంచి, ప్రజలనుంచి సలహాలు సూచనలను, ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచాలని కోరామని పీఎంఓ తెలిపింది. ఇప్పటి వరకు మన్ కీ బాత్‌కు సంబంధించి 44 ఎపిసోడ్‌లు ప్రసారమయ్యాయి. గత మే నెల 27న ప్రసారమైన మన్ కీ బాత్ ఇప్పటివరకు చివరిది.
కాగా వివిధ వనరులనుంచి సేకరించిన సమాచారం వేర్వేరు పత్రాల్లో ఉంటుంది. వీటిని క్రోడీకరించలేదని పీఎంఓ అధికారి పేర్కొన్నారు. ఇదే సమయంలో మన్ కీ బాత్‌కు సంబంధించి సమాచార స్వీకరణకు ఏ అధికారిని ప్రత్యేకించలేదని కూడా ఆ అధికారి స్పష్టం చేశారు. ఈ సమాచారం పట్ల సంతృప్తిని వ్యక్తం చేసిన సమాచార శాఖ ముఖ్య కార్యదర్శి (సీఐసీ), ఇందులో కలుగజేసుకోవడానికి తిరస్కరించారు.