జాతీయ వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌కు దీటుగా కాంగ్రెస్ సేవాదళ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: జాతీయతా వాదం తమకే సొంతం అంటూ ప్రచారం చేసుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సేవాదళ్ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా ప్రతి నెల ఆఖరు శనివారం దేశంలోని వెయ్యి నగరాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. దానికంటే ముందుగా మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ ఆశయాలను అలాగే జాతీయవాదం, లౌకికవాదం, పరమత సహనం, బహుళత్వం తదితర అంశాలపై క్షణ్ణంగా చర్చించిన అనంతరం ఒక కార్యాచరణను రూపొందిస్తామని సేవాదళ్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అనంతరం దీన్ని రాహుల్‌కు నివేదిస్తామని, ఆయన ఆమోదించిన వెంటనే కార్యాచరణలో పెడతామని ఆయన తెలిపారు. దీనిని సోమవారమే రాహుల్ గాంధీ ముందుంచుతామని సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ లాల్జీ భాయ్ దేశాయ్ విలేఖరులకు తెలిపారు. కొనే్నళ్లుగా సేవాదళ్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని, ఇకపై సేవాదళ్‌ను బలోపేతం చేస్తామని, ప్రజాసేవకు అంకితమవుతామని, జాతి నిర్మాణంలో పాలుపంచుకుంటామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో కార్యకర్తలందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, ఇందులో భాగంగానే సోమవారం మణిపూర్‌లో క్యాంప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల ఆఖరు శనివారం వేయి నగరాల్లో ‘్ధ్వజ్ వందన’ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. దీనితోపాటు మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ ఆశయాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. దేశవ్యాప్తంగా తమకు 700 సేవాదళ్ యూనిట్లు ఉన్నాయని, వాటిలో 20 నుంచి 200 మంది వరకు కార్యకర్తలు ఉంటారని ఆయన వివరించారు.