జాతీయ వార్తలు

‘ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేయవద్దు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేయవద్దని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆదివారం ఢిల్లీలో ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు యాతకుల భాస్కర్ మాదిగ, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ చట్టాన్ని గతంలో మాదిరిగానే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళిత, గిరిజనుల మీద దాడులు కొంతమేర తగ్గాయని వారు వెల్లడించారు. ఈ చట్టం దళిత గిరిజనులకు రక్షణ కవచంగా ఉందని, ఈ చట్టానికి మార్పులు చేస్తే బీజేపీ ప్రభుత్వంపై తాము తిరగబడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఎమ్మార్పీఎస్ నాయకులు మేడి పాపయ్య, డా.రాజవౌళి, మేకల నరేందర్, కొండ్ర శంకర్, గుర్రల శీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీకి చేరిన ఏపీ కాంగ్రెస్ ఓబీసీ
కార్యవర్గం జాబితా
ఏపీ కాంగ్రెస్ ఓబీసీ విభాగానికి సంబంధించిన కార్యవర్గం జాబితాను కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగ చైర్మన్ తంరద్వాజ్ సాహుకి అందజేసింది. ఏపీ కాంగ్రెస్ ఓబీసీ విభాగ చైర్మన్ నులుకుర్తి వెంకటేశ్వరావు, ఏఐసీసీ సెక్రటరీ గిడుగు రుద్రరాజు ఆదివారం ఏఐసీసీ కార్యాలయంలో కలిసి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించి తయారు చేసిన ఓబీసీ కన్వీనర్లు, రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులతో కూడిన జాబితాను కాంగ్రెస్ ఓబీసీ విభాగానికి అందజేసింది. ఈ పేర్లను పరిశీలించి త్వరలో పూర్తిస్థాయిలో ఓబీసీ విభాగాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది.