జాతీయ వార్తలు

తప్పుడు ప్రచారాలకు ఇక అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: ఇంటర్‌నెట్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో కిప్యాడ్ జిహాదీ గ్రూపులు పెట్టే తప్పుడు ప్రచారాలను అదుపుచేసేందుకు కేంద్ర హోంశాఖ కసరత్తు మొదలుపెట్టింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం ద్వారా ఉద్రిక్త పరిస్థితులకు కారణం అవుతున్నవారిని ఎదుర్కొనేందుకు కేంద్ర హోంశాఖ సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. కిప్యాడ్ జీహాదీ గ్రూపులు పెట్టే పోస్టులను తొలిగించే అంశంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సోమవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గోగా నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి హోం శాఖ ఉన్నత అధికారులతోపాటు ఐటీ, టెలికాం, జమ్మూకాశ్మీర్‌లోని భద్రత సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్కొననున్నారు. ఏదైన సంఘటన జరిగినప్పుడు ఇంటర్‌నెట్ ద్వారా కొందరు కావాలనే పుకార్లు సృష్టిస్తూ మత ఘర్షణలకు కారణం అవుతున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లో జరుగుతున్న పరిణమాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోం శాఖ ఈ విషయాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది. దీనిని తీవ్రంగా తీసుకున్న హోంశాఖ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు ఆ పోస్టులను తొలిగించే అంశంపై దృష్టి సారించింది. ప్రధానంగా మత ఘర్షణలు లాంటి సంఘటనలు జరిగినప్పుడు వివాదాస్పద పోస్టులవల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పకుండా భద్రత సంస్థలు, పోలీసులు కేసును నమోదు చేసి టెలికాం సర్వీసు ప్రొవైటర్లను సంప్రదించి వెంటనే ఆ పోస్టులను తొలగించడం, పోస్టులను పెట్టినవారిపై చర్యలు తీసుకోవడం, మరొకరు ఇలాంటివి చేయకుండా గట్టి చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు.