జాతీయ వార్తలు

బీఎస్పీ కలిసొస్తే సీట్ల త్యాగాలకూ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: బీజేపీని మట్టిగరిపించే విషయంలో సమాజ్‌వాదీ పార్టీ చిత్తశుద్ధితో ఉందని ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇందుకు అవసరమైతే కొన్ని సీట్లు వదులుకుని అయినా బీఎస్పీతో కలిసి నడిచేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ‘కొన్ని అసెంబ్లీ స్థానాలు బీఎస్పీ కోసం త్యాగం చేయాల్సి వస్తే అందుకు సమాజ్‌వాదీ పార్టీ సిద్ధపడే ఉంటుంది. ఎందుకంటే, మా ఇద్దరి లక్ష్యం బీజేపీని ఓడించడమే కనుక’ అన్నారు. 2019 ఎన్నికల వరకూ ఎస్పీ, బీఎస్పీల మధ్య అవగాహన కొనసాగుతుందని అఖిలేష్ వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం నాలుగు ఎంపీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీని బీఎస్పీ మద్దతుతో ఎస్పీ మట్టికరిపించటం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు ఎదుర్కోవాల్సిన తరుణంలో అఖిలేష్ యాదవ్ ప్రకటనకు ప్రాధాన్యత చేకూరింది. ఎన్నికలకు ముందు జరిగే ఒప్పందాల్లో తమకు గౌరవ ప్రదమైన స్థానాలు కేటాయిస్తే, విపక్ష కూటమిలో బీఎస్పీ బాధ్యతాయుత భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుందని పార్టీ సుప్రీమో మాయవతి ఇప్పటికే ప్రకటించటం తెలిసిందే. ఎస్పీ, బీఎస్పీలు కలిస్తే భాజపాకు మోత మోగినట్టేనని అఖిలేష్ వ్యాఖ్యానించారు. ‘ఎస్పీ, బీఎస్పీలు ఎలా కలుస్తాయన్న అంశానే్న ఇంకా బీజేపీ యోచిస్తోంది. కానీ, ఎన్నికల సమయంలో బీఎస్పీ మద్దతు ఎస్పీకి ఎలా దక్కుతుంది, ఎస్పీ సహకారం బీఎస్పీకి ఎలా అందనుందో వాళ్లే చూస్తారు’ అని అఖిలేష్ అన్నారు.

చిత్రం..మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేష్