జాతీయ వార్తలు

ఆ లేఖ ప్రామాణికత ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: ప్రధాని నరేంద్ర మోదీని, రాజీవ్ గాంధీ తరహాలో హత్య చేస్తామంటూ పేర్కొన్న లేఖ ప్రామాణికత ఎంత అంటూ సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరం ప్రశ్నించారు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఈ లేఖలోని నిజానిజాలను పూర్తి సాక్ష్యాధారాలతో ప్రభుత్వం బయటపెట్టాలని ఆయన కోరారు. ప్రధానికి పూర్తి భద్రత కల్పించడం ప్రభుత్వ విధి అని ఆయన పేర్కొన్నారు. ‘ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన ‘ఎల్గార్ పరిషత్’కు చెందిన వ్యక్తులకు ఈ కుట్రతో సంబంధమున్నదని ఒక మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యక్తులతో కాంగ్రెస్‌కు ఏవిధమైన సంబంధం లేదు’ అని చిదంబరం స్పష్టం చేశారు. ఈవిధంగా ధ్రువపరచని లేఖలను అంత తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరంలేదని చిదంబరం విలేకర్లతో అన్నారు. ఏది ఏమైనా ప్రధానికి పూర్తి భద్రత కల్పించాల్సింది ప్రభుత్వం మాత్రమేనన్నారు. ఇదిలావుండగా నరేంద్ర మోదీ రోడ్ షోలో పాల్గొన్న సమయంలో, రాజీవ్ గాంధీ మాదిరిగా హత్య చేయాలన్న కుట్రకు సంబంధించిన లేఖను ఒక మావోయిస్టు నేత వద్ద పూణె పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయాన్ని మహారాష్ట్ర పోలీసులు కోర్టులో చెప్పారు కూడా. అయితే దీనిపై ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్ స్పందిస్తూ, ‘లేఖ విషయం బీజేపీ ఆడుతున్న నాటకం. క్రమంగా ప్రజల్లో పాపులారిటీ కోల్పోతున్న బీజేపీ ప్రజలనుంచి సానుభూతిని సంపాదించడానికి ఇటువంటి ఎత్తులు వేస్తోంది. ఇటువంటి జిమ్మిక్కులతో ప్రజలు మోసపోరు’ అంటూ వ్యాఖ్యానించారు.