జాతీయ వార్తలు

నిలకడగా వాజ్‌పేయి ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని ఏబీ వాజపేయి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కిడ్నీ సంబంధిత సమస్య, ఇన్‌ఫెక్షన్లతో సోమవారం వాజపేయి ఎయిమ్స్‌లో చేరారు. 93 ఏళ్ల బీజేపీ అగ్రనేత వాజపేయి ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం ఎయిమ్స్ బులెటిన్ విడుదల చేసింది. ‘వాజపేయి ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్య సేవలకు ఆయన స్పందిస్తున్నారు. అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. ఇన్‌ఫెక్షన్లు తగ్గి ఆరోగ్యం కుదుటపడేవరకూ ఇక్కడే ఉంటారు’ అని బులెటిన్‌లో స్పష్టం చేశారు. ఎయిమ్స్ వైద్య నిపుణుడు డాక్టర్ రణ్‌దీప్ గులేరియా సారథ్యంలో వైద్యుల బృందం మాజీ ప్రధానికి వైద్య సేవలు అందిస్తోంది. ఎయిమ్స్‌లోని కార్డియాక్ సెంటర్ ఐసీయూలోనే ఉంచి వాజపేయికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయనకు సోమవారం డయాలసిస్ చేశారు. వాజపేయిని ఉంచిన ఎయిమ్స్ మొదటి అంతస్థులో ఉన్న పేషెంట్ల వద్దకు ఎవర్నీ అనుమతించడం లేదు. గుర్తింపు కార్డులు ఉంటేనే కుటుంబ సభ్యులను అనుమతిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే, మాజీ మంత్రి కల్‌రాజ్ మహారాజ్, లా సహాయ మంత్రి పీపీ చౌదరి మంగళవారం వాజపేయిని పరామర్శించారు. ప్రియతమ మాజీ ప్రధాని త్వరగా కోలుకోవాలంటూ ఢిల్లీ యువమోర్చా నేత పంకజ్ జైన్ ఎయిమ్స్ గేటు బయట ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్‌యేతర ప్రధానిగా ఐదేళ్లు పూర్తికాలం వాజపేయి నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేసింది. మంగళవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ తదితరులు వాజపేయిని పరామర్శించారు.

చిత్రం..పరామర్శించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్