జాతీయ వార్తలు

సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: విచిత్రమైన నిర్ణయాలతో అందరినీ ఆశ్చరపరిచే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి ముందు తన మంత్రులతో కలిసి ధర్నా చేశారు. సమ్మె చేస్తున్న ఐఎఎస్ అధికారులు ఆందోళన విరమించే దిశగా లెఫ్టినెంట్ గవర్నర్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని కేజ్రీవాల్ పత్రికలకు పంపారు. ఢిల్లీ ప్రభుత్వం పనిచేసే విధంగా లెఫ్టినెంట్ గవర్నర్ సహకరించాలన్నారు. సమ్మె చేస్తూ ప్రభుత్వ పనులకు ఆటంకం కల్పిస్తున్న ఐఎఎస్ అధికారుల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, వారి డిమాండ్లను పరిశీలించేందుకు ఏ చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆయన అన్నారు. తన మంత్రులతో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీసులో నిన్న సాయంత్రం నుంచి ఉన్నామన్నారు. పౌరులకు రేషన్‌ను ఇంటి వద్ద డెలివరీ చేసే ప్రతిపాదనను ఆమోదించాలని ఆయన కోరారు. ఐఎఎస్ అధికారులు మంత్రులు ఫోన్ చేస్తే స్పందించడంలేదని, సమీక్ష సమావేశాలకు హాజరు కావడం లేదన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూష్ ప్రకాశ్‌పై దౌర్జన్యం జరిగినట్లు ఆరోపణలు వచ్చినప్పటి నుంచి అధికారులు సహకరిచడం లేదన్నారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించే వరకు ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తిలేదన్నారు. అధికారుల సమ్మె వల్ల ఢిల్లీలో పరిపాలన స్తంభించిందన్నారు. క్లినిక్‌ల ఏర్పాటు, డ్రైన్ల నిర్మాణం, అక్రమ నిర్మాణాల తొలగింపు, ప్రైవేట్ స్కూళ్లకు నిధుల కేటాయింపు లాంటి అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్నారు. ఢిల్లీ వాసుల సంక్షేమం కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నామని కేజ్రీవాల్ అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం మద్దతుతోనే ఐఎఎస్‌లు సమ్మె చేస్తున్నారంటూ కొంత మంది అధికారులు తనకు వెల్లడించారన్నారు.

చిత్రం..లెఫ్టినెంట్ గవర్నర్ ఇంట్లో బైఠాయంచిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి
మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సత్యేంద్ర కుమార్ జైన్, గోపాల్ రాయ్