జాతీయ వార్తలు

స్వాగతించిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య సింగపూర్‌లో జరిగిన చారిత్రక సమావేశాన్ని భారత్ స్వాగతించింది. మన పొరుగు దేశానికి (పాకిస్తాన్) ఉత్తరకొరియా నుంచే అణు పరిజ్ఞానం లభిస్తోంది. ఈ లింకేజీపై తన అందోళనకు ఉత్తరకొరియా‘ ద్వీపకల్ప సమస్యపై’ వెలువడే తీర్మానంలో స్థానం లభిస్తుందన్న ఆశాభావాన్ని భారత్ వ్యక్తం చేసింది. నిన్నటి వరకు పరస్పరం కత్తులు దూసుకున్న అమెరికా-ఉత్తరకొరియా దేశాల మధ్య చారిత్రక సమావేశం జరగడం సానుకూల పరిణామమని భారత్ పేర్కొంది. చర్చలు, దౌత్య ప్రక్రియల ద్వారా కొరియన్ ద్వీపకల్ప సమస్యను పరిష్కరించుకోవడానికే భారత్ మద్దతు ఇస్తుందని, విదేశాంగశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. యుఎస్, డిపిఆర్‌కెల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలుపరిస్తే కొరియా ద్వీపకల్పంలో శాంతి సుస్థిరతలు వెల్లివిరుస్తాయని విదేశాంగశాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. నెలల తరబడి కొనసాగిన దౌత్యపరమైన ట్విస్ట్‌లు, మలుపుల తర్వాత ఎట్టకేలకు మంగళవారం ట్రంప్-కిమ్‌ల మధ్య సింగపూర్‌లో పరస్పర చర్చలు జరిగాయి.