జాతీయ వార్తలు

అబద్ధాల పుట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక తప్పుల తడక, సత్యదూరమైనదని, దురుద్దేశ పూర్వకంగా ఉందని భారత్ తీవ్రంగా స్పందించింది. కాశ్మీర్‌పై హ్రస్వదృష్టితో ఎంపిక చేసిన అంశాలపై అవాస్తవాలతో కూడిన అంశాలను నివేదికలో పొందుపరిచారని భారత్ ఘాటుగా విమర్శించింది. భారత్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్, పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఐక్యరాజ్యసమితి తొలిసారిగా నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక పూర్తిగా అబద్ధాల పుట్ట, ఊహాజనితమైన అంశాలపై ఇష్టం వచ్చినట్లుగా పేర్కొన్నారని భారత్ ఆరోపించింది. ఈ మేర కు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ నివేదిక భారత సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతను భంగం కలిగించే విధంగా ఐక్యరాజ్యసమితి తయారు చేసిందన్నారు. జమ్ముకాశ్మీర్ యావత్తూ భారత్‌లో భాగమని పేర్కొన్నారు. పాకిస్తాన్ దురాక్రమణద్వారా ప్రస్తుత పాక్‌లో ఉన్న కాశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించిందని భారత్ స్పష్టం చేసింది. ఆక్రమించిన భూభాగాల నుంచి వైదొలగాలని అనేక పర్యాయాలు భారత్ పాకిస్తాన్‌ను హెచ్చరించిందన్నారు. ఐక్యరాజ్యసమితి నివేదికలో అంశాలు దుందుడుకుతనంతో, తుంటరితనంతో, తప్పుదోవపట్టించే విధంగా ఉన్నాయని, ఈ నివేదికను అంగీకరించే ప్రసక్తిలేదని భారత్ కరాఖండిగా తెలిపింది. ఐక్యరాజ్యసమితి పేర్కొన్నట్లుగా ఆజాద్ జమ్ము,కాశ్మీర్, గిల్జిట్ బాల్టిస్తాన్ అనేవి ఉనికిలో లేవని భారత్ పేర్కొంది. ఈ నివేదికను తయారు
చేసిన వారు ఉద్దేశ్యపూర్వకంగానే సరిహద్దు ఉగ్రవాదం అంశాన్ని పక్కనపెట్టేశారన్నారు. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతం నుంచి చొరబాటుదారులను ప్రేరేపించి భారత్ సరిహద్దుల్లోకి పంపుతున్నారన్న వాస్తవాన్ని మర్చిపోయారా అని భారత్ ప్రశ్నించింది. దుర్బుద్ధితో రూపొందించిన ఈ తరహా నివేదికలు భారత్ సార్వభౌమత్వాన్ని, భారత ప్రజల ఆకాంక్షను దెబ్బతీయలేవని భారత్ తీవ్రపదజాలంతో విరుచుకుపడింది. తన సార్వభౌమత్వాన్ని, భౌగోళిక ప్రాంతాల సమగ్రతను ఎలా పరిరక్షించుకోవాలో భారత్‌కు బాగా తెలుసని కేంద్రం పేర్కొంది.

కాశ్మీర్‌లో అల్లరి మూకల దృశ్యం (ఫైల్ ఫొటో)