జాతీయ వార్తలు

ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లకు కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, జూన్ 14: ప్రవాసభారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) పెళ్లిళ్లను పెళ్లి జరిగినప్పటి నుంచి ఏడు రోజుల్లో తప్పనిసరిగా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం త్వరలో ప్రకటన చేయనుంది. ఏడు రోజుల్లోగా ప్రవాస భారతీయుల పెళ్లిళ్లను నమోదు చేయకపోతే వారికి పాస్‌పోర్టులు, వీసాలు జారీచేయరు. ప్రవాసభారతీయుల పెళ్లిళ్లు వివాదస్పదమవుతున్నాయి. విదేశాలకు వెళ్లిన తర్వాత వేధింపులు తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి
కేంద్రం ఒక కమిటీని నియమించింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో కలిపి ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ సమావేశమై పై నిర్ణయాన్ని తీసుకుంది. న్యాయపరమైన చిక్కులను పరిష్కరించేందుకు ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లకు చట్టబద్ధత అవసరమని ఈ కమిటీ అభిప్రాయపడింది. అందుకే వివాహం జరిగినప్పటి నుంచి ఏడురోజుల్లోగా తప్పనిసరిగా పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించాలి. ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లను 48 గంటల్లోగా నమోదు చేయాలని గతంలో కేంద్రమంత్రి మనేకా గాంధీ పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లు వివాదస్పదం కావడం, మోసపూరితంగా ఉండి పరారైన పక్షంలో అభియోగాలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను ఎస్క్రో పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనపై కమటీ చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎస్క్రో అంటే వివాదం తేలేవరకు థర్డ్ పార్టీ ఆధీనంలో అభియోగాలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులు ఉంటాయి. కాగా దీనికి సంబంధించి మూడు చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంటుంది. నేర శిక్షాస్మృతి, వివాహ చట్టం, పాస్‌పోర్టు చట్టానికి సవరణలు తేవాల్సి ఉంటుంది. ఈ మూడు చట్టాలకు సవరణలు తెచ్చే విధంగా ముసాయిదాను తయారు చేయాలని కమిటీని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం భారతదేశంలో వివాహాల రిజిస్ట్రేషన్‌పై నిర్ణీత కాలపరిమితి అంటూ ఏమీ లేదు. లా కమిషన్ మాత్రం వివాహాల రిజిస్ట్రేషన్ గడువు కనీసం 30 రోజులు ఉండాలని సిఫార్సు చేసింది. ఆ లోగా నమోదు చేయకపోతే, రోజుకు ఐదు రూపాయల చొప్పున జరిమానా విధించేటట్లు చర్యలు తీసుకోవాలని కోరింది. విదేశాంగ మంత్రిత్వశాఖ, న్యాయ శాఖ, హోంమంత్రిత్వశాఖలతో కలిపి ఒక సమగ్ర నోడల్ ఏజన్సీని ఏర్పాటు చేశారు. ఈ ఏజన్సీ ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్ల సమస్యలను అధ్యయనం చేసింది. గతంలో జాతీయ మహిళా కమిషన్ సిఫార్సు మేరకు వధువులను మోసం చేసి పెళ్లి చేసుకుని పరారయ్యే వరులను పట్టుకునేందుకు లుకవుట్ నోటీసులను ఇచ్చే విధంగా కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంది.