జాతీయ వార్తలు

హవాయి చెప్పులేసుకునేవారూ విమానాలెక్కాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిలాయ్ (ఛత్తీస్‌గఢ్), జూన్ 14: ‘హవాయి చెప్పులు వేసుకున్నవారు సైతం విమానాల్లో ప్రయాణం చేస్తే చూడాలన్నది తన కల’ అని ప్రధాని మోదీ అన్నారు. చాలాకాలంగా మావోయిస్టుల ప్రాబల్యంలో ఉన్న బస్తర్ ఏవియేషన్ మేప్‌లో చేరింది. జగదల్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వెళ్లే మొదటి విమానాన్ని ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉడాన్ పథకం కింద ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్‌కు 20 కిలోమీటర్లదూరంలో ఉన్న బస్తర్ ప్రాంతం నుంచి రాయ్‌పూర్‌కు విమాన సౌకర్యం కల్పించారు. ఎనిమిది మంది ప్రయాణికులతో కూడిన విమానాన్ని ప్రధాని మోదీ భిలాయ్ నుంచి ప్రారంభించారు. అనంతరం జయంతి స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ జగదల్‌పూర్ నుంచి రాయ్‌పూర్‌కు విమాన సౌకర్యం కల్పించడంతో వాటి మధ్య ప్రయాణ సమయం ఆరేడు గంటల నుంచి 40 నిముషాలకు తగ్గిందని చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్లే ఇది సాధ్యమైందని, ప్రజలు ఇప్పుడు ఏసీ కోచ్‌ల్లో కన్నా, విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు రోడ్లు సైతం వేయకుండా నిర్లక్ష్యం చేసిన ప్రదేశాల్లో సైతం తాము చక్కటి రోడ్లు, ఎయిర్‌పోర్టులను నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. అంతకుముందు రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టు నుంచి రోజుకు ఆరు విమానాలు మాత్రమే రాకపోకలు సాగించేవని, ఇప్పుడు 50 వరకు రోజూ తిరుగుతున్నాయని చెప్పారు. చిన్న నగరాలు, పట్టణాలను సైతం వాయుమార్గంలో కలపాలన్నదే కేంద్ర ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఇలా చేయడం వల్ల ఆయా ప్రాంతాలు ఆర్థికంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తాయని మోదీ పేర్కొన్నారు.