జాతీయ వార్తలు

ఇంకా పరిశీలనలోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: తెలంగాణలోని బయ్యారం, ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ఉక్కు కార్మాగారాలను ఏర్పాటు చేసేందుకు ఇతరులెవరైనా ముందుకు వస్తారా అనేది టాస్క్ఫోర్స్ పరిశీలనలో ఉన్నదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉక్కు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బయ్యారం, కడపలో ఉక్కు కార్మాగారాల ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలను ఇంకా పరిశీలిస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని పబ్లిక్ రంగ సంస్థల ప్రతినిధులతో కూడిన టాస్క్ ఫోర్స్ రెండు ప్రాంతాల్లో ఉక్కు కార్మాగారాల ఏర్పాటుకు రోడ్‌మ్యాప్ గురించి చర్చలు జరుపుతోందని తెలిపారు. బయ్యారం, కడపలో ఉక్కు కార్మాగారాలు ఏర్పాటు చేయటం సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఉక్కు మంత్రిత్వ శాఖ గురువారం ఈ ప్రకటన జారీ చేయటం గమనార్హం. టాస్క్ఫోర్స్ ఇప్పటికే పలుమార్లు సమావేశమై బయ్యారం, కడపలో ఉక్కు కార్మాగారాలను ఏర్పాటు చేసే అంశంపై చర్చలు జరిపింది. ఆఖరు సమావేశం ఈ నెల 12న జరిగిందని ప్రకటనలో తెలిపారు. ఉక్కు కార్మాగారాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తోందని కేంద్రం చెబుతోంది. రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూలులో ఇచ్చిన హామీ మేరకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా బయ్యారం, కడపలో ఉక్కు కార్మాగారాలు ఏర్పాటు చేసేందుకు గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపింది. బయ్యారం, కడపలో మూడు ఎంటీపీఏ సామర్థ్యం గల ఉక్కు కార్మాగారాలను ఏర్పాటు చేయటం ఆర్థికంగా లాభదాయకం కాదని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా 2014 డిసెంబర్ 2న అందజేసిన నివేదికలో పేర్కొన్నదని కేంద్ర ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ఈ నివేదిక వచ్చిన తరువాతనే 2016 అక్టోబర్ 16న ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇతరులెవ్వరైనా బయ్యారం, కడపలో ఉక్కు కార్మాగారాలను ఏర్పాటు చేసేందుకు గల సాధ్యసాధ్యాలను పరిశీలించటం ఈ టాస్క్ఫోర్స్ బాధ్యత. రెండు రాష్ట్రాల్లో ఉక్కు కార్మాగారాల ఏర్పాటుకు గల సాధ్యసాధ్యాల నివేదికను తయారు చేసేందుకు అవసరమైన వాస్తవ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని మెకాన్ సంస్థ ఇచ్చిపుచ్చుకోవలసి ఉంటుంది. మెకాన్ సంస్థ ఉక్కు కార్మాగారాల ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదికను తయారు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం వివరించింది.