జాతీయ వార్తలు

కోస్ట్‌గార్డ్ జిందాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాల్దియా, జూన్ 15: నడి సముద్రంలో మంటల్లో చిక్కుకున్న కంటైనర్ నౌక నుంచి 22 మందిని కోస్ట్‌గార్డ్ బలగాలు రక్షించాయి. అల్పపీడనంతో బంగాఖాఖాతం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో ఎంవి ఎస్‌ఎస్‌ఎల్ కోల్‌కతా షిప్ మంటల్లో చిక్కుకుంది. ఈ నౌకలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో 22 మంది ఉన్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి 11 గంటలకు జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 70 శాతం నౌక కాలిపోయింది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని క్షణమొక యుగంలా గడుస్తున్న సమయంలో కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఆర్‌సిజిఎస్ రాజ్‌కిరణ్ రంగంలోకి దిగింది. వీరిని గురువారం అర్ధరాత్రిలోపల సురక్షిత తీరానికి చేర్చారు. ఈ 22 మందిని హాల్దియా రేవుకు క్షేమంగా చేర్చినట్లు కోస్ట్ గార్డ్ పేర్కొంది. ఇప్పటికీ మంటల్లో చిక్కుకున్న ఎస్‌ఎస్‌ఎల్ కోల్‌కతాలో అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయని కోస్ట్ గార్డ్ అధికారి చెప్పారు. హాల్డియా రేవుకు చేరుకున్న నౌక మాస్టర్ రజత్ రంజన్ మాట్లాడుతూ కోస్ట్ గార్డ్‌లు సకాలంలో దిగి మమ్మలను ఆదుకోని పక్షంలో మృత్యువాత పడేవారమన్నారు. రాత్రంతా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి అలసిపోయామన్నారు. హాల్డియా రేవుకు చేరుకున్న 22 మందిని కోస్ట్‌గార్డ్ వెస్ట్ బెంగాల్ కమాండెంట్ డిఐజి ఏంఏఏ వర్శి సాదర పూర్వకంగా ఆహ్వానించారు. కోస్ట్ గార్డు రంగంలోకి దిగిన వీరిని రక్షించి మరో బోటులో హాల్దియా రేవుకు చేర్చింది. 24 గంటల పాటు తాము నరకం చూశామని మంటల్లో చిక్కుకున్న బోట్ మాస్టర్ రంజన్ చెప్పారు. భగవంతుడి దయ వల్ల తామంతా సురక్షితంగా బతికి బట్టకట్టామన్నారు. కోస్ట్‌గార్డ్ కెప్టన్ టి నాగమిలిన్ మాట్లాడుతూ, మంటల్లో చిక్కుకున్న నౌక నుంచి బాధితులను రక్షించడం సవాలుగా మారిందన్నారు. తమకు సమాచారం అందిన వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కోస్ట్ గార్డ్స్ కమాండర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. తమకు సమాచారం వచ్చిన వెంటనే రంగంలోకి దిగి గురువారం ఉదయం 8 గంటలకు మంటల్లో చిక్కుకున్న నౌక వద్దకు వెళ్లామన్నారు. హాల్దియా రేవు నుంచి 55 నాటికల్ మైళ్ల దూరంలో ఈ బోటు ప్రమాదంలో చిక్కుకుందన్నారు. ఈ నౌక 10683.51 ఎంటిల కార్గోను ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం నుంచి కోల్‌కొతారేవుకు రవాణా చేస్తోందని కెప్టెన్ చెప్పారు.