జాతీయ వార్తలు

స్వాతి హత్య కేసులో అనుమానితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 2: చెన్నై రైల్వే స్టేషన్‌లో జరిగిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి (24) హత్య కేసులో పోలీసులు ఎట్టకేలకు అనుమానితుడు రామ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన రామ్‌కుమార్‌ను దక్షిణ తమిళనాడులోని తిరునెల్వెలి జిల్లాలో గల అతని స్వంత ఊరులో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు రావడంతో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను ఒక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్యకు గురైన ఐటి ప్రొఫెషనల్ స్వాతి మృతదేహం సుమారు రెండు గంటలసేపు రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే పడి ఉండటంపై మద్రాస్ హైకోర్టు పోలీసులను మందలించిన విషయం తెలిసిందే. చెన్నైలోని చూలైమెడు ప్రాంతంలో స్వాతి ఇంటికి సమీపంలోనే నివసిస్తున్న రామ్‌కుమార్ ఈ హత్యకు కొన్ని నెలల ముందు ఆమెను అనుసరించి, ఆమె రాకపోకలను గమనించినట్లు సమాచారం. శివారులో గల తన కార్యాలయానికి వెళ్లడానికి నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో రైలుకోసం వేచిచూస్తున్న స్వాతిని గత నెల 24న ఉదయం 6.30 గంటల సమయంలో రామ్‌కుమార్ కొడవలితో దాడి చేసి హతమార్చాడు. రామ్‌కుమార్ స్వాతిని హతమార్చడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.