జాతీయ వార్తలు

అమెరికాకు భారత్ ఝలక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ: అమెరికా దిగుమతులపై సుంకాలను పెంచడంతో భారత్ కూడా అదేబాటలో నడవాలని నిర్ణయించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను పెంచే విషయమై ప్రపంచ వాణిజ్య సంస్థకు తెలిపింది. మొత్తం 30 వస్తువులపై సుంకాలను పెంచనున్నారు. ఇందులో మోటార్ సైకిళ్లు, ఇనుము, స్టీలు ఉత్పత్తులు, బోరిక్ యాసిడ్ తదితరాలు ఉన్నాయి. భారత్ నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూనిమియం ఉత్పత్తులపై అమెరికా భారీగా సుంకాలను పెంచింది. దీనివల్ల భారత్‌పై 241 మిలియన్ డాలర్ల ప్రభావం పడింది. భారత్ కూడా దిగుమతి సుంకాలను పెంచడంవల్ల అంతే సమానమైన భారం అమెరికాపై పడుతుంది. టారిఫ్‌లను పెంచడం వల్ల అదనంగా 241 మిలియన్ డాలర్లను అమెరికా భారత్ నుంచి వసూలు చేయనుంది. అమెరికానుంచి దిగుమతి అయ్యే వస్తువులపై రాయితీలను భారత్ ఎత్తివేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మేలోనే దాదాపు 20 ఉత్పత్తులపై వందశాతం వరకు సుంకాలను పెంచాలని భారత్ నిర్ణయించింది. ఇందులో బాదంపప్పు, యాపిల్, మోటార్ సైకిళ్లు ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ డాక్యుమెంట్‌కు లోబడి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచే అధికారం ఉందని ఈ ఏడాది మే 18న భారత్ తెలియచేసింది. అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల తలెత్తిన నష్టాలను పూడ్చుకునేందుకు వీలుగా గాట్ 1997 ఒప్పందం మేరకు నడుచుకుంటున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో అమెరికా సుంకాలు పెంచుతూపోతే, మరిన్ని వస్తువులపై సుంకాలను పెంచుతామని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మార్చి 9న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను గణనీయంగా పెంచారు. దీంతో ప్రపంచ వాణిజ్య రంగంలో ఆందోళన వ్యక్తమైంది. అల్యూమినియంపై 10శాతం, స్టీలు ఉత్పత్తులపై 25శాతం సుంకాలను పెంచుతూ అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాల పెంపు నిర్ణయం ఈనెల 21నుంచి అమలులోకి రానుంది. అమెరికా సుంకాలు పెంచడం వల్ల మన దేశానికి చెందిన స్టీలు ఎగుమతిదార్లపై రూ.1198.6 మిలియన్ డాలర్లు, అల్యూమినియం ఎగుమతిదార్లపై 42.4 మిలియన్ డాలర్ల ప్రభావం పడిన విషయం తెలిసిందే.